turbulence: విమానం అతలాకుతలం -ప్రయాణికులకు తీవ్ర గాయాలు -ముంబై-కోల్‌కతా విస్తారా సర్వీస్‌లో

వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోన్న విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. పైలట్లు విమానాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో ప్రయాణికులు అతలాకుతలం అయ్యారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం కోల్ కతాలో చోటుచేసుకుంది. వివరాలివి..

ముంబై నుంచి కోల్ కతాకు ప్రయాణించిన విస్తారా ఎయిర్ లైన్స్ విమానం, ఇంకాసేపట్లో కోల్ కతా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుందనగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేల అడుగుల ఎత్తులో ఉండగానే ఎయిర్ టర్బులెన్స్ కారణంగా విమానం భారీ కుదుపులకులోనైంది. ఈ ఘటనలో మొత్తం 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో..

Passengers Suffer Major Injuries as Mumbai-Kolkata bound Vistara’s flight hit severe turbulence

విస్తారా విమానంలో కుదుపుల కారణంగా గాయపడ్డ ఎనిమిది మంది ప్రయాణికుల్లో ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. నిమిషాపాటు ఎయిర్ టర్బులెన్స్ చోటుచేసుకోగా, ఎట్టకేలకు పైలట్లు విమానాన్ని కోల్ కతా ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ వెంటనే క్షతగాత్రులకు ఎయిర్ పోర్టులోనే ప్రథమ చికిత్స అందించి, సమీపంలోని ఆస్పత్రికి తరలించామని కోల్ కతా ఎయిర్ పోర్టు డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తామన్నారు.

విమానం స్థిరంగా ఎగిరే స్థితిని లామినార్ ఫ్లో అంటారని, అప్పుడు విమానం రెక్కలు తగిన లిఫ్ట్ సృష్టించడంతో ప్రయాణం సాఫీగా సాగుతుందని, అదే గాలి దిశలో అనూహ్య మార్పుల వల్ల తలెత్తే టర్బులెన్స్ ఏర్పడితే, విమానం స్థిరత్వాన్ని కోల్పోయి, కిందకి పైకి ఊగుతుందని, చాల అరుదుగా విమానాలు టర్బులెంట్ ఫ్లో లో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+