భార్యలను వదిలివెళ్లిన 45 మంది ఎన్ఆర్ఐ పాస్ పోర్టు రద్దు : కేంద్ర మంత్రి మేనకా గాంధీ
న్యూఢిల్లీ : ఎన్ఆర్ఐ భర్తలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకొని .. విదేశాలకు తీసుకెళ్లకుండా వదిలివెళ్లిన 45 మంది పాస్ పోర్టులను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బిల్లును రూపొందించింది. అయితే ఆ బిల్లును ఎగువసభ ఆమోదించలేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు.
ఉపేక్షించం
పెళ్లి చేసుకొని భార్యలను విదేశాలకు తీసుకెళ్లని ఎన్ఆర్ఐ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కఠినచర్యలు తీసుకోవాలని భావించింది. ఆ ఎన్ఆర్ఐ భర్తలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేసింది. వారికి లుక్ నోటీసు కూడా జారీచేస్తామని స్పష్టంచేసింది.

బిల్లుకు లోక్ సభ ఆమోదం
ఎన్ఆర్ఐ భర్తలపై కఠినచర్యలు తీసుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. కానీ ఎగువసభలో మాత్రం ఆమోదం పొందలేదు. రాజ్యసభలో రాఫెల్ కేటాయింపులపై దద్దరిల్లడంతో బిల్లు చర్చకు రాలేదు. దీంతోపాటు తలాక్ బిల్లు కూడా ఆమోదం పొందలేదు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందలేకపోవడంతో మోదీ సర్కార్ .. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications