నూతన సర్దార్ ఎవరు?: హార్దిక్‌కు లభించని పాతతరం విశ్వాసం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ వెనుక యువతరం నిలుస్తున్నా.. పాత తరం పాటిదార్లు మాత్రం ఇప్పటికీ బీజేపీకి మద్దతుదారులుగానే ఉన్నారు. వారు హార్దిక్‌ను తమ నాయకుడిగానే గుర్తించడం లేదని చెప్తున్నారు. బీజేపీ అసంతృప్త శ్రేణులు, నేతలు మాత్రమే ఆయనకు మద్దతునిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హార్దిక్‌కు మద్దతు ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా పాటిదార్లు తమ నూతన నాయకుడి కోసం అన్వేషణ సాగిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

పాటిదార్లు మూకుమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకనాడు సైకిల్ పైనే ప్రయాణం చేసిన హార్ధిక్ పటేల్ నేరుగా మెర్సిడెస్‌ కారులో ప్రయాణించడమే దీనికి కారణమని చెప్తున్నారు. అయితే హార్దిక్ సభలకు హాజరయ్యే భారీ జన సందోహం పోలింగ్ కేంద్రాల్లో ఏ మేరకు ఓటుగా మారుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కార్డు బోర్డు ‘నాగళ్ల'తో రోడ్ షోలో యువ పాటిదార్లు

కార్డు బోర్డు ‘నాగళ్ల'తో రోడ్ షోలో యువ పాటిదార్లు

హార్దిక్‌కు వ్యతిరేకంగా లీకైన సెక్స్ సీడీ వల్ల ఆయనకే భారీగా సానుభూతి చేకూరుస్తుందని అక్షత్ పటేల్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇక ఆదివారం సూరత్‌లో నిర్వహించిన మోటార్‌బైక్‌ల రోడ్‌షోకు వేల మంది యువత హాజరయ్యారు. పచ్చని టోపీలు ధరించి, జెండాలు ఊపుతూ సాగిన ఈ రోడ్ షోలో జై సర్దార్, జై పాటిదార్ అని నినదించారు. కార్డు బోర్డులతో తయారీచేసిన నాగళ్లు పట్టుకుని రోడ్ షోలో పాల్గొన్నారు. గుజరాత్‌లో ఈ దఫా బీజేపీ ఓటమి ఖాయం అని, ప్రజలదే విజయమని పేర్కొన్నారు.

 తామే నిజమైన హిందువులమంటున్న పటేళ్లు

తామే నిజమైన హిందువులమంటున్న పటేళ్లు

ముఖంపై ఎర్రటి తిలకం దిద్ది మరి హార్దిక్ ఫొటో ముద్రించిన టీ - షర్టులు ధరించి ముందుకు సాగారు. చక్ దే ఇండియా కోసం ఏదో కొంచెం చెద్దామంటూ నినదిస్తూ ముందుకు సాగిన యువ పాటిదార్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీస్తూ ఇతరులకు ఫార్వార్డ్ చేస్తూ ముందుకు సాగారు. హిందుత్వ ఎంతోకాలం ఓటమికి అతీతం కాదని రుజువు చేస్తామని మహదేవ్ పటేల్ అనే పాస్ నాయకుడు పేర్కొన్నారు. పాటిదార్లే నిజమైన హిందువులని చెప్పారు. ‘2015 నుంచి సాగిన పాటిదార్ల రిజర్వేషన్ ఆందోళనలో పోలీసు కాల్పుల్లో మరణించిన 14 మంది యువ పాటిదార్లు హిందువులు కాదా?' అని ప్రశ్నించారు.

 సూరత్ నగరంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో పాటిదార్లు కీలకం

సూరత్ నగరంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో పాటిదార్లు కీలకం

గుజరాత్‌లో ప్రజలకు, బీజేపీకి మధ్య ఎన్నికల పోరు నెలకొందని, ఈ పోరులో ప్రజలు గెలుపొందాలని పాటీదార్‌ అనామత్ ఆందోళన్ సమితీ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ పిలుపునిచ్చారు. సూరత్‌లోని యోగి చౌక్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ...రోడ్‌ షో కార్యక్రమాలకు, సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని, దీనిని బట్టి అధికార బీజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న సంగతి తేలిపోయిందని అన్నారు. పటేల్‌ సామాజిక వర్గమంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన కోరారు. అటు వర్తక, వ్యాపారపరంగా, ఇటు రాజకీయపరంగా దక్షిణ గుజరాత్‌ లోని సూరత్‌ ప్రాంతానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. బీజేపీకి వ్యతి రేకంగా సూరత్‌ చుట్టుపక్కల ప్రాంతంలో హార్దిక్‌ పటేల్‌ పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. దీంతో 2015 డిసెంబర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పాటీదార్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. రెట్టింపు సంఖ్యలో మున్సిపల్‌ స్థానాల్ని కాంగ్రెస్‌ గెలుచుకుంది. సూరత్ నగర పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలన్నీ 2012 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నది. వీటిలో ఐదు చోట్ల పాటిదార్లదే ఆధిపత్యం. ప్రత్యేకించి వరచ్చాలో 70 శాతానికి పైగా పాటిదార్ల జనాభా ఉంటుంది. హార్దిక్ పటేల్ సారథ్యంలోని పాస్ మద్దతుతో కనీసం సగం సీట్లైనా గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తున్నది.

హార్దిక్ పటేల్ కు మద్దతుగా మహిళా పాటిదార్ గ్రూపులు ఇలా

హార్దిక్ పటేల్ కు మద్దతుగా మహిళా పాటిదార్ గ్రూపులు ఇలా

తాను ఇంజినీర్‌ను, విద్యాభ్యాసం కోసం లక్షలు ఖర్చు చేశాం. కానీ నెలకు రూ.5000 వేతనం గల జాబ్ లభించడం లేదని అందువల్లే రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నామని అభయ్ రాజా ఝాలా వ్యాఖ్యానించారు. సూరత్ పట్టణంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న వారంతా సర్దార్ పటేల్ బ్యాడ్జీలు ప్రదర్శించారు. సౌరాష్ట్రకు చెందిన విరాల్ పటేల్ మాట్లాడుతూ ‘పటేల్ మా హీరో' అని వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీని నిర్మించిందే పాటిదార్లని, అది జీవితమంతా సాగుతుందని పొరపడొద్దని హెచ్చరిస్తున్నారు.ఆదివారం పాస్ మోటార్ బైక్ రోడ్ షోలో పాటిదార్ మహిళల గ్రూపులు కూడా పాల్గొనడం ఆసక్తికర పరిణామం. రోడ్ షో వెళుతున్నప్పుడు వారు ఇండ్ల ముందు నిలబడి హార్దిక్ పటేల్ కు మద్దతుగా అభివాదం చేయడం, జెండాలు ప్రదర్శించారు.

గ్రామీణ వజ్రాభరణాల పాలిషర్స్ ఆన్ లైన్ పత్రాలు పూరించెదెలా?

గ్రామీణ వజ్రాభరణాల పాలిషర్స్ ఆన్ లైన్ పత్రాలు పూరించెదెలా?


తాము చేసేందుకు పని లేదని, చేనేత కార్మికులుగా పని చేస్తేనే కుటుంబం గడుస్తుందని కార్మికులు తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ అంటేనే ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ రీజనల్ చైర్మన్ దినేష్ నవాడియా స్పందిస్తూ చిన్న వ్రజాభరణాల పాలిషర్‌పై జీఎస్టీ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాలిషింగ్ యూనిట్లలో సదరు జీఎస్టీ ఫారాలు ఆన్ లైన్‌లో భర్తీ చేయడం ఎలాగన్నది వాటి నిర్వాహకులకు తెలియదన్నారు. జీఎస్టీలో బీ2బీ తొలగించకపోతే వజ్రాభరణాల పరిశ్రమ ప్రమాదంలో పడుతుందన్నారు. ఇక పాటిదార్ యువత తమకు అవసరమైన ఉద్యోగాలు లభించే వరకు రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళన విరమించరని స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dozens of motorbikes throb, rev and zoom. Varacha road in Surat explodes in noise and tumult as Patidar leader Hardik Patel begins his road show. Sporting bright yellow caps, waving flags, some wielding cardboard ploughs to emphasise their farming roots, thousands of Patidar youths roar in unison, "Jai Sardar, Jai Patidar".As Hardik's motorcade rumbles forward, youths begin to sprint past, trying not to lose sight of him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి