Omicron:భయపడొద్దు.. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది: వెంకయ్య నాయుడు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలో 'ద మిడ్ వే బాటిల్: మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజలంతా ఇన్నాళ్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడంలో చొరవ తీసుకోవడంతోపాటు ఇతరులను కూడా ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.
Recommended Video
నడుస్తోన్న చరిత్రను పుస్తకరూపంలో తీసుకురావడం అంత సులువైన విషయం కాదనే ఉపరాష్ట్రపతి.. ఈ ప్రయత్నం చేసిన పుస్తక రచయిత గౌతమ్ చింతామణిని అభినందించారు. గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను ప్రస్తావిస్తూ.. ఈ మార్పుల ద్వారా 130 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలను బయటకు తీసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు.

జీవన ప్రమాణాలు మెరుగుపడటం, ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం, ఉపాధికల్పన, సొంతింటి కల, పారిశ్రామిక వర్గాలకు చేయూత కల్పించడంతోపాటు వివిధ అంశాల్లో పురోగతి స్పష్టంగా కనబడుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. బీమా కవరేజీ, పేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, గ్రామాల్లో విద్యుదీకరణ వంటి ఎన్నో కార్యక్రమాలు వేగవంతంగా, సమర్థవంతంగా అమలవుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రతి రంగంలో పురోగతి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థకు భారతదేశం కేంద్రంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య సముపార్జన అనంతరం భారతదేశం ఎన్నో ఆటుపోట్లను, ఇబ్బందులను ఎదుర్కొందన్న ఉపరాష్ట్రపతి, భారతదేశ పురోగతిని ఏ శక్తి అడ్డుకోబోదని, ఇకపై ప్రగతి పథంలో వచ్చే ఏ ఆటంకాన్నయినా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
ఇటు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉంది. అతను నవంబర్ 20వ తేదీన వచ్చారు. అప్పుడు నెగిటివ్ ఉండగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. 22వ తేదీన జినొమ్‌కు పంపించగా.. 23వ తేదీన నెగిటివ్ వచ్చింది. అతను 24 మంది ప్రైమరీ, 240 సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్నాయి. అతను దుబాయ్ ట్రావెల్ చేశాడు. అన్నీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వెతికీ మరీ పరీక్షలను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని.. అందరూ రెండు టీకాలు తీసుకున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications