jharkhand Exit poll: జార్ఖండ్ లో అధికారం మారుతుందా ?పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!
జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ తమ ఎగ్జిట్ పోల్ ను విడుదల చేసింది. కేవలం 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు సాగింది. దీంతో స్వల్ప ఆధిక్యంతో కూడా ఇక్కడ అధికారం చేతులు మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఎన్డీయే కూటమికే మొగ్గు ఇచ్చింది.

జార్ఖండ్ అసెంబ్లీలోని 81 సీట్లలో అధికారం చేపట్టాలంటే 41 సీట్లు రావాలి. ఈ నేపథ్యంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఎన్డీయే కూటమికి 44 నుంచి 53 సీట్లు రాబోతున్నట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అలాగే ఇండియా కూటమికి 25 నుంచి 37 సీట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తేల్చింది. ఇతరులకు మరో 5 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ లెక్కన ఇతరులు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదు.
ఈ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీకి 42.1 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అలాగే రెండో స్ధానంలో జేఎంఎంకు 20.8 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 16.2 శాతం, ఇతరులకు 16.3 శాతం, ఏజేఎస్యూకు 4.6 శాతం ఓట్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన చూస్తే జార్ఖండ్ లో అధికార మార్పుకు ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications