విజయ్ పై కక్షసాధింపు?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తోన్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాల్లో ఆయా పార్టీల అగ్ర‌నేత‌లు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను రూపొందించుకుంటోన్నాయి.

ఈ ప‌రిణామాల మ‌ధ్య తమిళన వెట్రి కజగం అధినేత విజయ్.. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చొన్నారు.

Peravallur Police Register Five-Section Case Against TVK Vijay and 5000 Party Workers including MCC

పెరంబూర్ నుంచి ఆయన సోమవారమే నామినేషన్ సైతం దాఖలు చేశారు. నేడో, రేపో తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి నామినేషన్ వేయనున్నారు. ఈ పరిణామాల మధ్య విజయ్‌పై పెరవల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళి ఉల్లంఘనతో పాటు మొత్తం అయిదు సెక్షన్ల కింద ఈ కేసు దాఖలైంది.

ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్‌ స్పీకర్లను వినియోగించారని, అంబులెన్స్ ప్రయాణానికి ఆటంకం కలిగించారని కుమార్ లిఖితపూరకంగా పెరవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 5,000 మందికి పైగా జనాలను పోగుచేసి ప్రజలకు అసౌకర్యం సృష్టించడం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.

ప్రజలకు అసౌకర్యం, రవాణాను అడ్డుకోవడం, చట్టవిరుద్ధంగా అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువమందిని సమీకరించడం సహా అయిదు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పెరవల్లూరు పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన దీనిలో ఒక భాగమని పోలీసులు స్పష్టం చేశారు. విజయ్‌తో పాటు దాదాపు 5,000 మంది టీవీకే పార్టీ కార్యకర్తలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ సంఘటనపై పెరవల్లూరు పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+