పెంపుడు కుక్కల పెళ్లి: ఆహ్వానపత్రికలు పంచి, బాజా భజంద్రీలతో.. డీజే డ్యాన్సులతో అట్టహాసంగా వేడుక!!

ఎక్కడైనా అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేయడానికి వెడ్డింగ్ కార్డులు పంచి, బాజాభజంత్రీలతో గ్రాండ్ గా పెళ్లి చేయడం చూసి ఉంటాం. కానీ కుక్కలకు పెళ్లి చేయాలని భావించి, అందరూ చెప్పుకునేలా గ్రాండ్ గా వెడ్డింగ్ కార్డులు పంచి, బాజాభజంత్రీలతో పెళ్లి చేసి, డీజే డాన్స్ తో అదరగొట్టిన ఘటన ఎక్కడా చూసి ఉండం.. కానీ అటువంటి ఘటనే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది.

పెంపుడు కుక్కల పెళ్లి ... హర్యానా రాష్ట్రంలో ఆసక్తికర ఘటన

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఇరుగు పొరుగున ఉండే రాణి, మనీత అనే ఇద్దరు స్నేహితులు కుక్కలను పెంచుకుంటున్నారు. రాణి దంపతులకు సంతానం లేకపోవడంతో వారు పెంచుకున్న ఆడ కుక్క స్వీటీ ని తన బిడ్డగా భావించారు. ఇక మనీత దంపతులు షేరూ అనే మగకుక్కని పెంచుకుంటున్నారు. స్వీటీ పెరిగి పెద్దదై, పెళ్లి చేయాలని భావించిన సమయంలో, పొరుగునే ఉన్న మనీత తమ షేరూ తో స్వీటీకి పెళ్లి చేద్దామని రాణి దంపతుల వద్ద ప్రపోజల్ పెట్టారు. ఇంకేం రెండు కుటుంబాల వారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నాలుగు రోజుల్లోనే రెండు కుక్కలకు పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు చేశారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం.. కార్డులు పంచిమరీ పెళ్లి

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేద్దామని నిర్ణయించుకున్న వారు ఈ మేరకు 100 మందిని ఆహ్వానించారు. పెళ్లి కార్డులు ముద్రించి అందరికీ పంచారు. ఇక బంధుమిత్రులకు ఆన్లైన్లో, ఫోన్ ద్వారా కూడా ఆహ్వానాలు పంపి, వివాహానికి ముందు రోజు రెండు కుక్కలకు హెల్దీ వేడుక చేశారు. ఆపై వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. బాజాభజంత్రీలతో స్వీటీ కి, షేరూ కి వివాహం జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన వారంతా ఆ రెండు కుక్కల పెళ్లిని ఎంజాయ్ చేశారు. ఇక డీజే లు పెట్టి డాన్సులు చేశారు.

కుక్కల పెళ్లిపై అందరిలో ఆసక్తి.. ఎంజాయ్ చేసిన రెండు కుటుంబాల వాళ్ళు

కుక్కల పెళ్లిపై అందరిలో ఆసక్తి.. ఎంజాయ్ చేసిన రెండు కుటుంబాల వాళ్ళు

మొత్తానికి పక్కపక్క ఇళ్లలో ఉంటున్న స్వీటీ, షేరు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ఇంటి వాళ్ళు అయినా, పెళ్లయిన తర్వాత రెండు కుక్కలు ఒకే చోట కలిసి ఉంటాయా లేక ఎవరి ఇంట్లో వాళ్లు ఉంచుకుంటారా అన్నది.. ఈ పెళ్లి చూసినవారికి ఉత్పన్నమైన కొత్త ప్రశ్న. ఇక ఈ పెళ్లి తంతు తెలిసిన కొందరు కుక్కలకు పెళ్లి ఏంటి అని నవ్వుకుంటూ ఉంటే, మరికొందరు కుక్కల పెళ్ళి చేయడం ఆసక్తిగా ఉందని చూడడానికి వెళ్లారు. ఎవరేమనుకున్నా కుక్కలకు పెళ్లి చేసిన రెండు కుటుంబాల వాళ్లు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+