raksha bandhanస్పెషల్: 20పైసలు ఊరట -35రోజుల తర్వాత తగ్గిన Petrol Price -మెట్రో నగరాల్లో రేట్లివే..
దేశమంతటా రక్షా బంధన్ పండుగ జరుపుకొంటోన్న జనంపై ఆయిల్ కంపెనీలు దయ చూపాయి. రాఖీ పౌర్ణమి వేళ భారత ప్రజలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. చాలా కాలంగా సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు ఇవాళ కొద్దిగా తగ్గాయి. ఒకటీ రెండు కాదు, ఏకంగా 35 రోజుల తర్వాత..
ఆయిల్ కంపెనీలు ఇధన ధరలను తగ్గించాయి. ఆదివారం వెలువడిన ప్రకటనతో లీటర్ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. అదేవిధంగా డీజిల్‌పై 18 పైసలు తగ్గించాయి. దాదాపు పది రోజులపాటు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు రాఖీ పండుగనాడైనా కొంత తగ్గాయి. తాజా సవరింపులతో..

పెట్రోల్, డీజిల్ స్వల్ప తగ్గింపుతో దేశంలోని మెట్రో నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్ 96.64, చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్ 93.66, కోల్‌కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్ 92.13, బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్ 94.49గా ఉన్నాయి. ఇక తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69, డీజిల్ రూ.97.15కి తగ్గాయి. కాగా,
దేశంలో మే, జూన్ నెలల మధ్య పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఆ రెండు నెలల్లో 42 సార్లు అధికమయ్యాయి. మొత్తంగా లీటరు పెట్రోలుపై రూ.11.52 వినియోగదారులపై భారం మోపాయి. అయితే ఈ బాదుడుకు జూలై 18న బ్రేక్ పడింది. తాజాగా చాలా కాలంపాటు స్థిరంగ ఉన్న పెట్రోల్ ధరలు ఇవాళ 20 పైసల మేర తగ్గాయి. ఇక,
Recommended Video
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు చేయలేమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారమే స్పష్టం చేశారు. ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న పెట్రోల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలనే తగ్గించాలనే డిమాండ్ ఉంది. అయితే పెట్రోల్ ధరలను తగ్గించే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని మంత్రి అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తోందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications