ఎట్టకేలకు స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు: నేటి ధరల వివరాలు ఇవే!
న్యూఢిల్లీ: వరుసగా 15రోజులు పైపైకి ఎగబాకిన పెట్రోల్ ధరలు బుధవారం ఎట్టకేలకు స్వల్పంగా తగ్గాయి. ఈ మేరకు లీటరు పెట్రోలుపై ఢిల్లీలో 60పైసలు తగ్గగా.. ముంబైలో 59పైసలు తగ్గింది. అలాగే ఢిల్లీలో లీటరు డీజిల్ పై 56పైసలు తగ్గగా.. ముంబైలో 59పైసలు తగ్గింది.
ధరలు స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో ఆయా మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు ఇలా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.77.83, ముంబైలో రూ.85.65, కోల్‌కతాలో రూ.80.47, చెన్నైలో రూ.80.80గా ఉంది. ఇక డీజిల్ రేట్ల విషయానికొస్తే.. ఢిల్లీలో బుధవారం లీటర్ డీజిల్ ధర రూ.68.75గా ఉండగా, ముంబైలో రూ.73.20, కోల్‌కతాలో రూ.71.30, చెన్నైలో రూ.72.58గా ఉంది. కాగా, ఆయా రాష్ట్రాల పన్నుల్లో వ్యత్యాసం ఉండటంతో రాష్ట్రాన్ని బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి.


తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!