వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తమకు అలవాటైన రీతిలో పెట్రోల్ రేట్లను పెంచేశాయి చమురు సంస్థలు. డీజిల్‌పై మాత్రం కనికరాన్ని కురిపించాయి. ధరలను తగ్గించాయి. మే 4వ తేదీన ఇంధన ధరలు పెరుగుదల బాట పట్టిన తరువాత తగ్గడమనేది ఇదే తొలిసారి. ఆ తగ్గుదల కూడా డీజిల్‌కు మాత్రమే పరిమితం చేశాయి. పెట్రోల్ రేట్లు మరోసారి పెరగడం వల్ల వాహనదారులపై మళ్లీ అదనపు భారం పడింది. పలు నగరాల్లో పెట్రోల్ రేటు 110 రూపాయలకు చేరువ అవుతోంది.

రేపు వనపర్తి జిల్లాకు వైఎస్ షర్మిల: తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష షురూరేపు వనపర్తి జిల్లాకు వైఎస్ షర్మిల: తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష షురూ

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 25 నుంచి 34 పైసలు పెంపుదల చోటు చేసుకుంది. డీజిల్‌ రేటు మాత్రం 17 పైసల మేర తగ్గింది. తాజా సవరణలతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.101.19 పైసలకు చేరింది. డీజిల్ ఆదివారం నాటి కంటే తగ్గింది. రూ.89.88 పైసల నుంచి రూ.89.72కు తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 107 రూపాయలను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.106.20 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్‌ ధర 97.29 పైసలకు తగ్గింది. చెన్నైలో పెట్రోల్ రూ.101.92కు చేరగా డీజిల్‌ ధర రూ.94.39 నుంచి రూ.94.24 పైసలకు తగ్గింది.

Petrol Price Hiked again on July 12 2021 as up to 28 Paise and Diesel rates cut Marginally

తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.101.35 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.92.97 నుంచి రూ.92.81 పైసలకు పడిపోయింది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.104.58 పైసలకు పెరిగింది, డీజిల్ రూ.95.26 నుంచి రూ.95.09 పైసలకు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.01 పైసలకు పెరగ్గా.. డీజిల్ రూ.97.79 పైసలకు తగ్గింది. భోపాల్‌లో పెట్రోల్ రూ.109.53 పైసలకు చేరగా, డీజిల్ రూ.98.67 నుంచి రూ.98.50 పైసలకు పడిపోయింది.

పాట్నాలో పెట్రోల్ రూ.103.52 పైసలు, డీజిల్ రూ.95.30 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.98.29 పైసలు, డీజిల్ ధర తగ్గి రూ.90.11 పైసలకు చేరింది. రాంచీలో పెట్రోల్ రూ.96.18 పైసలు, డీజిల్ రూ.94.68 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.97.37 పైసలు, డీజిల్ రూ.90.11 పైసలుగా రికార్డయింది. డీజిల్ రేట్లు తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కలిగించినట్టయింది. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా సమానంగా ఉంటూ వస్తోన్నాయి. చాలా చోట్ల వంద రూపాయలకు చేరువైంది. ఈ పరిస్థితుల్లో డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటోన్నారు.

English summary
Petrol prices have been hiked across the metros on Monday July 12, after a day's pause. In the national capital, petrol rates were hiked by 28 paise while Diesel rates were cut marginally as 17 paise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X