జయ గురించి శశికళ చాలా దాచారు: విషప్రయోగం సీనియర్ అనుమానం
అన్నాడీఎంకే అధినేత్రి, రెండు రోజుల క్రితమే పార్టీ నేతగా ఎన్నికైన శశికళ పైన మాజీ స్పీకర్ పాండియన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, రెండు రోజుల క్రితమే పార్టీ నేతగా ఎన్నికైన శశికళ పైన మాజీ స్పీకర్ పాండియన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జయలలిత విషయంలో శశకళ చాలా విషయాలు దాచి పెట్టారని ఆరోపించారు.
జయలలిత పైన విషప్రయోగం జరిగిందనే అనుమానాలు తమకు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత అనారోగ్యంతో ఉంటే ఎమ్మెల్యేలను, ఎవరినీ అనుమతించలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జయ మృతి వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు.

ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లకుండా శశికళ అడ్డుకున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి గెంటివేయబడ్డ శశికళ.. జయలలిత కుటుంబ సభ్యురాలు ఎలా అవుతారని ప్రశ్నించారు. జయలలిత అనారోగ్యంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారని చెప్పారు.
జయలలితను ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని శశికళ దాచి పెట్టారని చెప్పారు. చికిత్స ఎలా అందించారనే విషయాన్ని కూడా సీనియర్ నేతలకు చెప్పలేదన్నారు. శశికళ నాయకత్వం పైన పార్టీ నేతల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications