Selfie: సెల్ఫీ వచ్చిందో లేదోకాని మర్మాంగం కాలిపోయింది, సంసారానికి పనికిరాకుండా పోయిన స్టూడెంట్ !
బెంగళూరు/హుబ్బళి: శుభకార్యాలు, విందులు, వినోదాలకుహాజరైన సమయంలో ఎక్కువగా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కొందరు అయితే పనిపాట వదిలేసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఎన్నిలైక్ లు వస్తాయి అని ఆసక్తిగా చూస్తుంటారు. గతంలో సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సెల్ఫీల పిచ్చి మాత్రం తగ్గడం లేదు. ఇక్కడ ఓ యువకుడు అక్కడ సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరం అని తెలిసినా ఓ చోటకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ ఫోటో వచ్చిందో లేదో కాని అతని మర్మాంగానికి విద్యుత్ షాక్ తగిలి సంసారానికి పనికిరాకుండా పోవడమే కాకుండా ఆసుపత్రిలో కుయ్యోమర్రో అంటున్నాడు.

సెల్ఫీల పిచ్చి మామూలుగా లేదు
మామూలుగా మొబైల్ లో ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇలాంటి ఫోటోలకంటే సెల్ఫీలు తీసుకోవాలని యువతి, యువకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. శుభకార్యాలు, విందులు, వినోదాలకుహాజరైన సమయంలో ఎక్కువగా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.

నాముఖానికి ఎన్ని లైక్ లు వస్తాయో చూద్దాం
కొందరు అయితే పనిపాట వదిలేసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఎన్నిలైక్ లు వస్తాయి అని ఆసక్తిగా చూస్తుంటారు. సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సెల్ఫీల పిచ్చి మాత్రం తగ్గడం లేదు.

రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లిన కాలేజ్ అబ్బాయి
కర్ణాటకలోని హుబ్బళి నగరంలో వినాయక అనే కాలేజ్ స్టూడెంట్ నివాసం ఉంటున్నాడు. వినాయక్ కు సెల్ఫీలు తీసుకునే పిచ్చి ఎక్కువ అయ్యింది. రోజుకు లెక్కలేనన్ని సెల్ఫీలు తీసుకుంటున్న వినాయక్ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఎలక్ట్రికల్ రైళ్లు ఎక్కువగా సంచరించే హుబ్బళిలోని శిరిడి నగర రైల్వేస్టేషన్ దగ్గరకు వినాయక్ వెళ్లాడు.

ఒళ్లు మరిచిపోయి సెల్ఫీలు
శిరిడి నగర రైల్వేస్టేన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ సంచరించడం అపాయం, డేంజర్ అనే బోర్డులు పెట్టారు. వినాయక్ కు ఏం పూనకం వచ్చిందో ఏమోకాని నేరుగా శిరిడి నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని డేంజర్ బోర్డులు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతానికి వెళ్లిన వినాయక్ ఒళ్లు మరిచిపోయి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు.

సెల్ఫీ వచ్చిందో లేదోకాని మర్మాంగం కాలిపోయింది
సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో వినాయక్ కు హైటెన్షన్ వైర్ల దెబ్బకు విద్యుత్ షాక్ తగిలింది. వినాయక్ శరీరంలోని పలు ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. అయితే వినాయక్ మర్మాంగం పూర్తిగా కాలిపోవడంతో కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన రైల్వే సిబ్బంది, పోలీసులు వినాయక్ ను హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంసారానికి పనికిరాకుండా పోయాడు
ప్రమాదం అని తెలిసినా కాలేజ్ స్టూడెంట్ రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. సెల్ఫీల పిచ్చితో డేంజర్ జోన్ లోకి వెళ్లిన కాలేజ్ అబ్బాయి వినాయక్ విద్యుత్ షాక్ తో మర్మాంగం కాలిపోయి సంసారానికి పనికిరాకుండా పోవడమే కాకుండా ఆసుపత్రిలో కుయ్యోమర్రో అంటున్నాడు.












Click it and Unblock the Notifications