వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ కేసీఆర్ ఆశ్చర్యం, మీరే ఆదర్శమని (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

నయా రాయపూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, నమ్మశక్యం కాని దిగుబడులు సాధిస్తున్నారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ రైతులు గ్రీన్ హౌస్, పాలిహౌస్ వ్యవసాయం, బిందు సేద్యం ద్వారా ప్రగతిని సాధిస్తున్నారన్నారు. ఇక్కడి విధానాలు తమ రైతులకు నేర్పిస్తామని, సాగును లాభసాటిగా మారుస్తామన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఛత్తీస్‌గఢ్ వెళ్లిన కేసీఆర్.. వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, పరిశోధన కేంద్రాలను సందర్శించారు. బెమెత్ర జిల్లా కొహడియా తదితర చోట్ల ఆయన రైతులతో మాట్లాడారు. వ్యవసాయ విధానాలను, రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఎకరానికి 80 టన్నుల క్యాప్సికాన్ని పండిస్తున్నట్లు ఓ రైతు, ఎకరానికి 420 క్వింటాళ్ల మిర్చి వస్తోందని మరో రైతు వివరించారు. దీంతో కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్, చైనాల మాదిరే ఛత్తీస్‌గఢ్ రైతులు ప్రయాణం చేస్తున్నారన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిగ దిగుబడులు సాధిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే తనకు ఛత్తీస్‌గఢ్ రైతుల ఘనత తెలిసిందని, ఇక్కడ అధికోత్పత్తులు సాధిస్తున్న విత్త, పరిశోధన సంస్థ ఎండీ ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నానని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి వ్యవసాయాన్ని తెలుసుకొని తమ రైతులకు వివరిస్తానని, ఆ రోజే చెప్పానని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఇక్కడకు వచ్చానని అన్నారు ఐక్యంగా వ్యవసాయం, పరస్పర అవగాహన, అనుబంధం, సమస్యల పైన ఎప్పటికప్పుడు చర్చించుకొని పరిష్కరించుకోవడం, ఆధునిక విధానాలను పాటించడం వంటి ప్రగతిశీల లక్షణాలు ఛత్తీస్‌గఢ్ రైతులను ఉన్నతస్థాయిలో నిలిపాయన్నారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నది తమ సంకల్పమని, ఇందుకోసం రైతులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తన పైన ఉందని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ నేలల్లో బంగారు పంటలు పండాలని, ఇక్కడ ఉన్న కొన్ని పద్ధతులైనా నేర్చుకోవాలని, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు ఐక్యంగా పని చేసుకుంటూ వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణ రైతులను ఇప్పటికే అంకాపూర్ పంపిస్తున్నానని, త్వరలోనే ఛత్తీస్‌గఢ్ పంపిస్తామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఛత్తీస్‌గఢ్‌లో నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోందని, తమ దగ్గర ఈ పరిస్థితి లేదని, కష్టకాలంలో ఉన్న తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను అభ్యర్థించామని, ఆయన అండగా ఉండేందుకు హామీ ఇచ్చారని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

విద్యుత్ అందుబాటులో ఉంటే మా రైతులు బాగుపడతారని, తెలంగాణలోని స్థితిగతులను వ్యవసాయానికి, విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని, మా రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు కూడా తమ వద్ద వరి విత్తనాలు వస్తున్నాయన్నారు.

కేసీఆర్

కేసీఆర్

మన రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నది మాత్రమే అడ్డు అని, సంస్కృతి, నాగరికత, జీవనవిధానంలో రెండు ఒక్కటేనని, కాకతీయుల వంశీయులు ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నారని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

కేసీఆర్

కేసీఆర్

కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్‌గఢ్ వచ్చిన కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు రాయపూర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుండి నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అనంతరం దుర్గ్ జిల్లాలోని మాల్ పుర్ గ్రామంలో కూరగాయలు, పంట తోటలను సందర్శించారు. తర్వాత బెమెత్రా జిల్లా కొహడియాకు వెళ్లారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ దినోత్సవం కావడంతో కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Photos of Telangana CM K Chandrasekhar Rao in Chhattisgarh fields.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X