"భారత్ కు బెస్ట్ డీల్ వచ్చింది"
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. దీనివల్ల ప్రస్తుతం భారతీయ ఉత్పత్తులపై 25 శాతం ఉన్న సుంకాలు గణనీయంగా 18 శాతానికి తగ్గాయి. అయితే భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డీల్ పై హర్షం వ్యక్తం చేశారు. భారత్ కు అమెరికా నుంచి బెస్ట్ డీల్ కుదిరిందని తెలిపారు.
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. వాణిజ్య పరంగా అనేక అవకాశాలను ఈ డీల్ ఇస్తుందని తెలిపారు. ఈ మేరకు అమెరికాతో వెరీ గుడ్ డీల్ జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంతో భారత్ లోని రైతులు ఏమాత్రం నష్టపోరని తెలిపారు. భారత్ కు మున్ముందు శుభ ఫలితాలు సమకూరుతాయని పీయుష్ గోయల్ స్పష్టం చేశారు.
ఈ మేరకు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా ప్రజలకు అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి పీయుష్ గోయల్. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ, ట్రంప్ ప్రదర్శించిన దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం, నిబద్ధతకు కృతజ్ఞతలు అని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. భారత్- అమెరికా మధ్య జరిగిన ఈ ఒప్పందం రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పిస్తోందన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ డీల్ కేవలం కేవలం ఒప్పందం మాత్రమే కాదని భారత్- అమెరికా మధ్య సంబంధాలను పునర్నిర్మించే దిశ మాత్రమే కాకుండా వికసిత్ భారత్- 2047 కు కీలక మలుపు అని స్పష్టం చేశారు.

ఇక సోమవారం ఫిబ్రవరి 2న భారత్- అమెరికా మధ్య వాణిజ్య సంబంధంలో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారతీయ వస్తువులపై ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీతో ఫోన్ కాల్ అనంతరం ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ఇదే విషయంపై పోస్టు చేశారు. "ఇవాళ ప్రధాని మోదీతో మాట్లాడాను. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. అలాగే శక్తివంతమైన నాయకుడు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపడానికి.. యూఎస్, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది" అని ట్రంప్ పేర్కొన్నారు.
-
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications