ఒడిషాలో కుప్పకూలిన విమానం..! టేకాఫ్ అయిన కాసేపటికే..!
ఒడిశాలో ఇవాళ ఓ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సుందర్ ఘడ్ జిల్లాలోని రూర్కెలా ఎయిర్ స్ట్రిప్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 9 సీటర్లు కలిగిన ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన కాసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఇండియా వన్ ఎయిర్ సంస్థకు చెందిన ఈ చిన్న విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు అందులో ఉన్నారు. అయితే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారు గాయాలతో తప్పించుకున్నారు. విమానం టేకాఫ్ కాగానే సాంకేతిక లోపం ఎదురుకావడంతో అదుపు తప్పి ఇలా కుప్పకూలినట్లు సమాచారం.

#WATCH | Odisha, Rourkela: A small private plane crashed at Kansar, Rourkela, in Sundargarh District, with people trapped inside. Upon receiving the information, fire units from Rourkela Fire Station and Panposh Fire Station were rushed to the scene for rescue efforts.
— ANI (@ANI) January 10, 2026
(Source:… https://t.co/wJeK4Ru8Vo pic.twitter.com/Ku6d0tob7e
ఘటన జరిగిన వెంటనే అత్యవసర ప్రతిస్పందన బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ప్రయాణీకులు , సిబ్బందిని తక్షణ వైద్య సాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని , ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ ఉమాకాంత నాయక్ మాట్లాడుతూ.. ఈ విమానం భువనేశ్వర్ నుండి రూర్కెలాకు వస్తోందని, ఏటీసీతో కనెక్షన్ తెగిపోయి కాసేపు జాడ తెలియలేదని వెల్లడించారు. చివరికి విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని తెలిసిందన్నారు. ఇందులో ఉన్న నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. విమానాన్ని సురక్షితమైన ప్రదేశంలో ల్యాండ్ చేసినందుకు పైలట్‌కు ధన్యవాదాలు తెలిపారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications