కేంద్రం కీలక నిర్ణయం: కరోనా చికిత్స నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు

న్యూఢిల్లీ: భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ సోకిన బాధితులకు అత్యవసరంగా వైద్య చికిత్సలో ఉపయోగించే ప్మాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి కోవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యారోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.

Recommended Video

    Plasma Therapy No Longer Part Of Covid-19 Treatment - ICMR || Oneindia Telugu

    కరోనా చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి కరోనా చికిత్సలో ప్మాస్మా థెరపీ నిలిచిపోనుంది. కరోనా రోగులకు ఇప్పటి వరకు అత్యవసర సమయాల్లో ప్మాస్మా థెరపీ ద్వారా వైద్యం అందించిన విషయం తెలిసిందే.

     Plasma therapy no longer part of Covid-19 treatment: ICMR

    కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కొన్ని రోజులకు ప్మాస్మా దానం చేస్తున్న విషయం తెలిసిందే. ప్మాస్మా వల్ల కొంత ప్రయోజనం ఉందని ప్రచారం జరగడంతో పలువురు ప్రముఖులు కూడా ప్మాస్మా దానం చేసి ఇతరుల ప్రాణం కాపాడాలంటూ పిలుపునిచ్చారు. అయితే, ఐసీఎంఆర్ తాజా నిర్ణయంతో ఇక కరోనా చికిత్సలో ప్మాస్మా థెరపీ ఉండదు.

    కరోనాను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గాఉన్న కరోనా బాధితులకు ఎక్కించేవారు. తద్వారా అతడి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని పలువురు వైద్యులు తెలిపారు. అయితే, ప్మాస్మా థెరపీ వల్ల మరణాలను అడ్డుకోలేమని, పెద్ద ఉపయోగం లేదని ఐసీఎంఆర్ గతంలోనే పేర్కొంది. ఇప్పుడు కరోనా చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై కరోనా రోగుల చికిత్సలో ప్మాస్మా థెరపీని ఉపయోగించడం జరగదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+