వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ సీఎం కాకుండా అడ్డుకోండి: సుప్రీం కోర్టులో పిల్

జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పు వారంలోగా రానున్న నేపథ్యంలో అంతవరకు శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యకుండా అడ్డుకోవాలని తమిళనాడుకు చెందిన సత్తా పంచాయత్ ల్యాకం అనే స్వచ్చంద సంస్థ .

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే చీఫ్ శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ కూడా నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ అక్రమాస్తుల కేసు తీర్పు వారంలోగా రానున్న నేపథ్యంలో అంతవరకు శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యకుండా అడ్డుకోవాలని తమిళనాడుకు చెందిన సత్తా పంచాయత్ ల్యాకం అనే స్వచ్చంద సంస్థ ప్రధాన కార్యదర్శి సెంథిల్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.

Plea in SC stay Sasikala’s Swearing-in till Verdict in Disproportionate Assets case

జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పీల్ పై వారంలో తీర్పు వెలువరించే అవకాశం ఉందని సుప్రీం కోర్టు సంకేతాలు ఇచ్చిన వెంటనే స్వచ్చంద సంస్థ కార్యదర్శి సెంథిల్ సుప్రీం కోర్టులో శశికళకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారు.

శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆమె నిందితురాలు అని కోర్టు తీర్పు ఇస్తే మళ్లీ తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి వస్తారని, ఇలా జరిగితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సెంథిల్ సుప్రీం కోర్టులో మనవి చేశారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితులురాలు. ఇప్పటికే ఈ కేసులో శశికళ జైలుకు వెళ్లి వచ్చారు. ఫిబ్రవరి 7వ తేది మంగళవారం ఈ పిల్ విచారణకు రానుంది.

English summary
Even as preparations are in full swing for AIADMK General Secretary VK Sasikala to be sworn in as Tamil Nadu Chief Minister on Tuesday, a PIL has been filed in the Supreme Court seeking stay on the same till the judgment in a disproportionate assets case involving her is decided.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X