ICC World Cup 2023 Final: రేపు ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని...
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కు భారత్, ఆస్ట్రేలియా తరఫున పలువురు రాజకీయ నేతలు ముఖ్య అతిధులుగా హాజరుకాబోతున్నారు. ముఖ్యంగా తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కు ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. అలాగే ఆస్ట్రేలియా తరఫున ఉప ప్రధాని కూడా హాజరయ్యే అవకాశాలున్నట్లు గుజరాత్ సీఎం ఇవాళ తెలిపారు.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ధృవీకరించారు. ప్రధాని నరేంద్రభాయ్ మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా పలువురు ప్రముఖులు ఈ ఫైనల్ మ్యాచ్‌ని చూడటానికి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియానికి వస్తారని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం ట్వీట్ చేశారు.

టీమిండియా చాలా కష్టపడి ఫైనల్ కు చేరుకుందని, కాబట్టి వారిని ఫైనల్లో మరింత ఉత్సాహపరిచేందుకు స్వయంగా ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీమిండియా 12 సంవత్సరాల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. కాబట్టి జట్టును ఉత్సాహపరిచేందుకు నరేంద్ర మోడీ స్టేడియంలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రుల రూపంలో ప్రభుత్వ పెద్దలంతా తరలివస్తున్నారు. 1983, 2011 తర్వాత భారత్‌కు మూడోసారి ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
-
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications