G20 సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం- షేర్పాలు, మంత్రులకు మోడీ థ్యాంక్స్..

రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇవాళ తొలిరోజే న్యూఢిల్లీ డిక్లరేషన్ పై ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. భారత్ ఆతిధ్యమిస్తున్న జీ20 సదస్సులో చేసే డిక్లరేషన్ కు సంబంధించి అక్కడక్కడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విదేశాంగమంత్రి జైశంకర్ సహా దౌత్యవేత్తలు ఆయా దేశాల షేర్పాలు, మంత్రులతో చర్చలు జరిపారు. ఫైనల్ గా న్యూఢిల్లీ డిక్లరేషన్ ను మార్పులతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిక్లరేషన్ కు ఆమోదం లభించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.

జీ20 సదస్సు తొలి సెషన్‌లో ప్రధాని మోదీ శనివారం ప్రసంగిస్తూ.. న్యూఢిల్లీ జీ20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడిందని అన్నారు. తాను ఈ డిక్లరేషన్‌ను ఆమోదించాలని ప్రకటిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా తమ షెర్పాతో పాటు కష్టపడి పనిచేసిన మంత్రులను అభినందిస్తున్ననంటూ మోడీ వెల్లడించారు. అంతకు ముందు రష్యా యుద్దం విషయంలో డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలపై పాశ్చాత్య దేశాలు అభ్యంతరాలు తెలిపాయి.

PM Modi

ఈ ఉదయం అంతర్జాతీయంగా విశ్వాస రాహిత్యాన్ని అంతం చేయాలని సభ్యులకు పిలుపునిస్తూ ప్రధాని మోడీ రెండు రోజుల సమ్మిట్‌ను ప్రారంభించారు. ఆఫ్రికన్ యూనియన్‌కు మరింత ప్రాతినిధ్యం వహించే ప్రయత్నంలో బ్లాక్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ జీ20 అధ్యక్షుడిగా భారతదేశం ఈ ప్రపంచ విశ్వాస లోటును ఒక విశ్వాసంగా మార్చాలని మొత్తం ప్రపంచానికి పిలుపునిస్తోంది" అని ఆయన అన్నారు. "మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇది అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆశయాలపై గ్రూపులో విభేదాల మధ్య ఇవాళ సదస్సు ప్రారంభమైంది. 2022లో ఇండోనేషియాలో జరిగిన సమ్మిట్ సందర్భంగా ఉక్రెయిన్‌లో యుద్ధంపై సమూహం తీవ్రంగా విభజించబడింది. ఎందుకంటే చాలా దేశాలు రష్యాపై దాడిని ఖండించినప్పటికీ, భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయని డిక్లరేషన్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+