ప్రధాని మోడీ మరో ఫీట్.. ఎర్రకోటపై ఆరోసారి ప్రసంగం.. ఇదివరకు వాజ్‌పేయి
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మరో ఫీట్ సాధించబోతున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకుసాగుతున్న మోడీ .. ఎర్రకోటపై ఆరోసారి ప్రసంగిస్తూ రికార్డు సాధించబోతున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయితో సమానంగా ఆయన ఆరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. దీంతోపాటు ఆరోసారి జాతీయ జెండా ఎగరవేయబోతున్నారు.
2014 నుంచి 2018 వరకు ఐదు సార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేశారు నరేంద్ర మోడీ. 2019 ఆగస్ట్ 15తో అది ఆరోసారి. ఇదివరకు 1998 నుంచి 2003 వరకు వాజ్ పేయి ఆరుసార్లు జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో మోడీ వాజ్ పేయి సరసన చేరబోతున్నారు. జాతీయ జెండా ఎగరవేసి .. ఆరో ప్రసంగం చేసి రికార్డు సాధించబోతున్నారు. ఆరో ప్రసంగంతోపాటు మరో ప్రాధాన్యం కూడా ఉంది. ఈ సారి ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన లాంటి చారత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కొద్దిరోజులకే పంద్రాగస్టు రావడంతో జాతి దృష్టి మరింత ఆకర్షిస్తోంది. మరోవైపు కశ్మీర్‌లో హోంమంత్రి అమిత్ షా జెండా ఎగరవేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.













Click it and Unblock the Notifications