PM Modi: డ్యూటీ మొదలుపెట్టిన ప్రధాని మోడీ-తొలి సంతకంతో రైతులకు గుడ్ న్యూస్..!,
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో నిన్న ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఉదయం తన కార్యాలయంలో మూడోసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు అధికార లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత రైతులకు సంబంధించిన కీలక పథకం నిధుల్ని విడుదల చేస్తూ తొలి సంతకం కూడా చేసారు. అనంతరం కేబినెట్ భేటీ, పార్లమెంట్ సమావేశాలపై దృష్టిసారించారు.
#WATCH | PM Narendra Modi today took charge as the Prime Minister, in New Delhi.
— ANI (@ANI) June 10, 2024
After being sworn in as Prime Minister for the 3rd time, PM Narendra Modi signed his first file authorising the release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers and… pic.twitter.com/G4ownB0NFh
ప్రధాని మోడీ ఇవాళ బాధ్యతలు తీసుకున్న తర్వాత పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదల ఫైలుపై సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల మేర దీంతో ప్రయోజనం చేకూరబోతోంది. అనంతరం ప్రధాని మోడీ కొత్త మంత్రులతో భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తొలి కేబినెట్ భేటీ నిర్వహణకు ప్రధాని సిద్దమవుతున్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

అనంతరం పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు వీలుగా రాష్ట్రపతికి వినతి చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారంతో పాటు ఇతర కార్యక్రమాల కోసం తొలి పార్లమెంట్ సమావేశాలను త్వరలోనే నిర్వహిస్తారు. ఇందులో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపికతో పాటు ఇతర కార్యక్రమాలు చేపడతారు. ఈ దిశగా ప్రధాని మోడీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో కీలక పదవులపై మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మోడీ సిద్ధమవుతున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications