వయనాడ్‌లో పర్యటించిన ప్రధాని మోడీ: ఏరియల్ సర్వే, బాధితులకు పరామర్శ
వయనాడ్: భారీ వరదలతో కొండచరియలు జారిపడి విధ్వంసానికి గురైన కేరళలోని వయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. శనివారం ఉదయం 11 గంటలకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు చేరుకున్నారు.
Prime Minister Shri @narendramodi visits relief camps in Wayanad, Kerala, to meet families affected by landslides. pic.twitter.com/088y4JcVbO
— BJP (@BJP4India) August 10, 2024
ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడిన ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి సురేశ్ గోపి కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం ప్రధాని మోడీ కాల్పెట్టలో పర్యటించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో మోడీ పర్యటించారు. ఆ తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బందితో మోడీ భేటీ అయ్యారు.

అనంతరం వయనాడ్‌లోని పలు సహాయ శిబిరాలు, ఆసుపత్రులను ప్రధాని మోడీ సందర్శించారు. వయనాడు బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. ఆ తర్వాత అధికారులతో మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ఘటన గురించి, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ఆయనకు అధికారులు వివరించారు.
#Kerala | Prime Minister @narendramodi conducts aerial survey of the landslide-affected area in Wayanad
— DD News (@DDNewslive) August 10, 2024
CM Pinarayi Vijayan is accompanying him#waynadlandslide pic.twitter.com/ES3sCmNVMl
గత నెల (జులై) 29-30 తేదీల్లో జరిగిన ఈ భారీ ప్రకృతి విపత్తులో కనీసం 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Kerala | PM Narendra Modi undertook an aerial survey in Wayanad before physically visiting the location of the disaster.
— ANI (@ANI) August 10, 2024
In the aerial survey, he saw the origin of the landslide, which is in the origin of Iruvazhinji Puzha (River). He also observed the worst affected areas of… pic.twitter.com/bGGSbIbbZ6
భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమవడంతో వేలాది మంది నిరాశ్రయలయ్యారు. కాగా, విపత్తు బాధిత ప్రాంతాల్లో పునరావాసం, సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం రూ.2,000 కోట్లను సాయంగా కోరింది. ఈ సమయంలోనే మోడీ వయనాడ్ పర్యటనకు వచ్చారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడంతోపాటు బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు.
Prime Minister Shri @narendramodi visited the areas affected by landslides in Wayanad, Kerala. pic.twitter.com/v4rHwxScFS
— BJP (@BJP4India) August 10, 2024
PM Shri @narendramodi Ji visited the hospital to meet and interact with the victims and survivors of the landslides in Wayanad. pic.twitter.com/XeUnBCtrp1
— Sambit Patra (@sambitswaraj) August 10, 2024












Click it and Unblock the Notifications