Delhi Assembly Election 2025: బీజేపీకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ప్రధాని మోదీ

దిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ మేరకు దిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. దిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఫిబ్రవరి 5న ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని దిల్లీలోని ప్రజలంతా అంటున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వాటర్ టాంకర్ మాఫియాను అడ్డుకుని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రభుత్వాన్ని దిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

"అబద్ధపు వాగ్దానాలు, మోసాలను దిల్లీ ప్రజలు కోరుకోవడం లేదు.ఇలాంటివి చేయడానికి ఆప్ సర్కార్ కు ఇక చోటులేదు. ప్రజలకోసం ఇళ్లు నిర్మించే ప్రభుత్వం దిల్లీకు కావాలి.మహిళలు,విద్యార్థులు,వృద్ధులు,ఆటో డ్రైవర్లు,చిరువ్యాపారులకోసం మా మేనిఫెస్టోలో పథకాలు రూపొందించాం" అని అన్నారు.

PM Modi Confident of BJP s Victory in Delhi Elections Claims Support Across the City

ఆప్ అసమర్థ పాలన వల్ల దిల్లీ అభివృద్ధి చెందిన రాజధానిగా కనిపించడం లేదని అన్నారు. వికసిత్ భారత్ కోసం కోట్ల మంది భారతీయులు కృషి చేస్తుంటే.. ఆప్ సర్కార్ అందకు అంగీకరించడం లేదని ప్రధాని మోదీ తెలిపారు. దిల్లీను కాంగ్రెస్, ఆప్ సర్కార్ లు 14ఏళ్లు, 11ఏళ్లు పాటు పాలించాయి. కానీ ఇక్కడ ఏమీ మారలేదు.. బీజేపీకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని అన్నారు.

ఇక దిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+