ఐదు రాష్ట్రాల్లో గెలుపు మాదే- ప్రధాని మోడీ ధీమా-రేపు యూపీ తొలిదశ నేపథ్యంలో వ్యాఖ్యలు

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ ఇవాళ స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమని మోడీ ఇవాళ జోస్యం చెప్పారు. రేపు యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఐదు రాష్ట్రాల్లో గెలుపుపై మోడీ జోస్యం

ఐదు రాష్ట్రాల్లో గెలుపుపై మోడీ జోస్యం

ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ నిరంతరం నిమగ్నమై ఉంటుందని, అధికారంలో ఉన్నప్పుడు సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ అనే మంత్రంతో పనిచేస్తామని ప్రధాని మోడీ ఇవాళ ఏఎన్ఐ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి వేవ్ కనిపిస్తోందని మోడీ తెలిపారు. తాము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని జోస్యం చెప్పారు. 5 రాష్ట్రాల్లోని ప్రజలు తమకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎన్నికలతో పాటు రైతు నిరసనల తర్వాత కేంద్రం ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలు, ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్, ఇటీవల పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగం, వంశపారంపర్య రాజకీయాలు తదితర అంశాలపై కూడా ప్రధాని మోడీ సమగ్రంగా మాట్లాడారు.

 ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీకే మొగ్గు

ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీకే మొగ్గు


తానను అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడం చూశానని ప్రధాని మోడీ తెలిపారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ప్రజలు తమకు సేవ చేసే అవకాశం బీజేపీకి ఇస్తారని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇప్పటికే 'ఏక్ బార్ ఆవో, ఏక్ బార్ జావో' (ఒకసారి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత వెళ్లండి) అనే పాత సిద్ధాంతాన్ని విసిరివేసారని మోడీ తెలిపారు. 2014లో దాన్ని ఆమోదించారని, ఆ తర్వాత ప్రజలు మా ప్రభుత్వ పనిని చూసి 2017లో, అలాగే 2019లో కూడా ఎన్నుకున్నారని మోడీ తెలిపారు. ఇప్పుడు 2022లో, వారు మళ్లీ తమ పనిని చూసి మళ్లీ అవకాశం ఇస్తారని మోడీ జోస్యం చెప్పారు.

 వారసత్వ రాజకీయాలపై కామెంట్స్

వారసత్వ రాజకీయాలపై కామెంట్స్


గెలిచినా, ఓడినా, మనకు ఎన్నికలు ఒక ఓపెన్ యూనివర్శిటీ అని మోడీ అన్నారు. ఇందులో కొత్త రిక్రూట్‌మెంట్, ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. దీనిని ఎన్నికల రంగంగా పరిగణిస్తున్నామన్నారు.
ఓ కుటుంబం తరతరాలుగా పార్టీని నడుపుతున్నప్పుడు, రాజవంశం మాత్రమే ఉంటుందని మోడీ తెలిపారు. డైనమిక్స్ ఉండవన్నారు. జమ్మూ కాశ్మీర్ మొదలుకొని, రెండు వేర్వేరు కుటుంబాలు నడుపుతున్న రెండు పార్టీలు, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఇదే ధోరణి కనిపిస్తోందన్నారు. వంశ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువన్నారు.

Recommended Video

    UP Elections 2022: BJP Manifesto ఉచిత ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు | Amit Shah | Oneindia Telugu
     మోడీ సర్కార్ ప్రాధాన్యతలివే

    మోడీ సర్కార్ ప్రాధాన్యతలివే

    వ్యాపారం చేయడానికి ప్రభుత్వానికి వ్యాపారం లేదని, పేదలకు ఆహారం గురించి ఆలోచించడం, వారికి ఇళ్లు, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రోడ్లు, చిన్న రైతుల గురించి ఆలోచించడం దీని పని. ఇది నా ప్రాధాన్యత అని మోడీ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో జాతీయ సంపదను రికవరీ చేస్తున్న దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాన్ని ప్రశంసించాలని ప్రజల్ని మోడీ కోరారు. యూపీలో మహిళలు చీకటి పడ్డాక కూడా బయటికి అడుగు పెట్టవచ్చని అంటున్నారని, భద్రతకు ఈ నమ్మకం చాలా అవసరమని మోడీ తెలిపారు. యూపీలో ఒకప్పుడు గూండాలు ఏదైనా చేయగలరని, కానీ ఇవాళ వారంతా లొంగిపోయారని మోడీ గుర్తుచేసారు.. యోగి ఆదిత్యనాధ్... భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారని, దాంతో రాజీపడలేదని మోడీ వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+