Tejas: తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రధాని మోడీ-బెంగళూరు హెచ్ఏఎల్ నుంచి కాసేపు..
ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ భారత దేశ వైమానిక సత్తాకు తలమానికమైన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్ లో కాసేపు విహరించారు. బెంగళూరులోని హిందుస్ధాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లో వైమానిక సామర్ధ్యంపై సమీక్ష కోసం వచ్చిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా తేజస్ రెండు సీటర్ల విమానంలో కాసేపు ఆకాశంలో విహరించారు. ఈ సందర్భంగా మన వైమానిక సామర్ధ్యంపై ఎక్స్ లో ప్రశంసల జల్లు కురిపించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులోని రక్షణ రంగ ప్రభుత్వ సంస్ధ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. దాని తయారీ కేంద్రంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. అనంతరం తేజస్ విమానం ఎక్కి కాసేపు చక్కర్లు కొట్టారు.

అనంతరం తేజస్ లో తన ప్రయాణాన్ని వివరిస్తూ ఎక్స్ లో ప్రధాని మోడీ ఓ పోస్టు పెట్టారు. ఇందులో తేజస్ లో ఓ ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశానన్నారు. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉందన్నారు. మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని గణనీయంగా పెంచిందని మోడీ తెలిపారు. అలాగే మన దేశ సామర్థ్యం గురించి తనకు కొత్త గర్వాన్ని, ఆశావాదాన్ని ఇది మిగిల్చిందంటూ ప్రధాని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO
— Narendra Modi (@narendramodi) November 25, 2023
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications