Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై మోడీ రియాక్షన్..! మిత్రదేశానికి అండగా..
ఇరాన్ అధ్యక్షుడు సయ్యిద్ ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగమంత్రి, అజర్ బైజాన్ గవర్నర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అడవుల్లో కుప్పకూలింది. దీంతో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఈ దుర్వార్తను ఇరాన్ ప్రభుత్వం ఇవాళ ధృవీకరించింది.
ఈ నేపధ్యంలో పలువురు ప్రపంచ దేశాధినేతలు స్పందిస్తున్నారు. నిన్న ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఆచూకీ లేకుండా పోవడంతోనే ఆందోళన మొదలైంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పలువురు ప్రపంచ దేశాధినేతలు ఆకాంక్షించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇవాళ ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా రైసీ మృతిని ధృవీకరించింది. దీంతో పలు దేశాల నేతలు, అధినేతలు తమ సంతాపం ప్రకటిస్తున్నారు.

Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…
— Narendra Modi (@narendramodi) May 20, 2024
ఇదే క్రమంలో ఇరాన్ కు మిత్రదేశమైన భారత్ కూడా స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ రైసీ మృతిపై దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల తీవ్ర విచారం మరియు దిగ్భ్రాంతి. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి మరియు ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది." అంటూ మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..!










Click it and Unblock the Notifications