పోలింగ్ బూతుల్లో కెమెరాలున్నాయ్.. బీజేపీకి ఓటెయ్యకపోతే అంతే.. గుజరాత్ బీజేపీ నేత కామెంట్ !
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ నేతల కాంట్రవర్సీ కామెంట్లు కొనసాగుతోన్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాలిక్కరుచుకొని .. ఈసీ ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవల కుల, మత రాజకీయాలను నేతలు ప్రస్తావించగా .. ఓ అడుగు ముందుకేసిన బీజేపీ ఎమ్మెల్యే పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరా పెట్టామని చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోన్నాయి.

పోలింగ్ బూతుల్లో కెమెరాలా ?
'ఆయా పోలింగ్ బూతుల్లో ప్రధాని మోదీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ మీరు కాంగ్రెస్‌కు ఓటేశారనుకో అది మాకు తెలిసిపోతోంది. ఈవీఎంపై బీజేపీ అభ్యర్థి జశ్వంత్ సింగ్ భాబోర్, బీజేపీ గుర్తు కమలం కనిపిస్తోందని చెప్పారు. ఆ రెండు చూసి నిర్ధారించుకొని, ఓటేయాలని సూచించారు. మీరు ఓటేసే సమయంలో ఎలాంటి అవంతరాలు ఎదురుకావని, అందుకోసం మోదీ ఏర్పాట్లు చేశారు‘ అని గుజరాత్‌లోని ఫతేపుర బీజేపీ ఎమ్మెల్యే రామేశ్ కథారా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దహోదా నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తన నోటిదురుసుకు ప్రదర్శించారు.

ఎవరికీ ఓటేస్తున్నారో తెలుస్తోంది ?
ఓటేసే సమయంలో వయోజనులు ఎవరికీ ఓటేస్తున్నారో తెలుస్తోంది. ఆధార్ కార్డు, మిగతా ధ్రువీకరణ పత్రాలు కూడా ఇప్పడు ఫోటోలతో వస్తున్నాయని చెప్పారు. అదేకాదు ఒకవేళ మీరు బీజేపీకి ఓటు వేసింది, వేయనిది సులభంగా తెలిసిపోతుందని వివరించారు రమేశ్. అంతేకాదు ఓటేసిన వారికే ఉద్యోగ, ఉఫాది అవకాశాలు కల్పిస్తామని .. ఓటేయని వారికి నౌకరీ ఉండదని బహిరంగంగానే బెదిరించారు.

ఇది సరికాదు ?
రమేశ్ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే రమేశ్ చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవద్దని ఆర్జేడీ ట్వీట్ చేసింది. 'గొంతెత్తలేని, ఎలాంటి సాయం లేని పౌరులు, బీజేపీకి ఓటేసే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు వారిపై ప్రభావం చూపుతాయి‘ అని లాలు యాదవ్ ట్వీట్ చేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications