వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ బీహార్‌లో రూ.900 కోట్ల ప్రాజెక్టులు -ప్రారంభించిన ప్రధాని మోదీ -సీఎం నితీశ్‌పై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీహార్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో బీహార్ లో ఏర్పాటు చేసిన రూ.900 కోట్ల విలువైన మూడు కీలక ప్రాజెక్టులను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

Recommended Video

PM Modi Launches 3 Petroleum Projects In Bihar | Oneindia Telugu

బీహార్ లో ప్రధాని మోదీ ప్రారంబించిన మూడు పెట్రోలియం ప్రాజెక్టుల్లో.. ఒకటి దుర్గాపూర్-బంకా పైప్ లైన్ అగ్మెంంటేషన్ కాగా, మిగతా రెండు ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంటులు. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల ద్వారా రూ.900 కోట్లతో వీటిని నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

PM Modi inaugurates 3 key petroleum projects in Bihar, says Nitish is the face of NDA

15 ఏళ్ల కిందట బీహార్ లో కొత్త రోడ్లు వేయడం కూడా చర్చనీయాంశంగా ఉండేదని, అప్పటి పరిస్థితికి రాజకీయ నేతల తీరు, నిధుల లేమి కారణాలని, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బిహార్ ను అభవృద్ధి పథంలో నడిపించారని, అందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా దండిగా సహకరించిందని ప్రధాని మోదీ అన్నారు.

''కేంద్రం పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో దేశానికే బీహార్ ఆదర్శప్రాయంగా నిలిచింది. నవ బీహార్ నిర్మాతగానేకాదు, నవ భారత్ ప్రక్రియలోనూ సీఎం నితీశ్ కుమార్ పాత్ర చాలా గొప్పది. బీహార్ లో ఎన్గీఏకు ముఖచిత్రం ఎవరైనా ఉన్నారంటే అది నితీశ్ ఒక్కరే'' అని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కలిసి పోటీ చేయనున్న జేడీయూ, బీజేపీలు సీట్ల రద్దుబాటుపై చర్చలు జరుపుతుండగా, ఎన్టీఏ పక్షానికే చెందిన ఎల్జేపీ పార్టీ.. సీఎం సీటు తమకే కావాలని కోరుతున్న దరిమిలా.. 'బీహార్ ఎన్డీఏకు నితిశ్ ముఖచిత్రం'అని మోదీ స్పష్టం చేయడం రాజకీయ సంకేతంగానూ స్థానికులు భావిస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi dedicates to the nation three projects related to the petroleum sector in Bihar, through video conferencing on sunday. speaking at the event, pm says the state has been exemplary in taking Centre’s scheme to people. and also endorsed Nitish Kumar as the face of NDA in Bihar, saying he "played a big role for a new India and a new Bihar".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X