మోదీకి భయం ఎందుకు?: ధైర్యం ఉంటే..: రాహుల్ సవాల్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగానికి నిరసనగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. మోదీ ప్రసంగం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. అధికార పార్టీ ససేమిరా అంటోంది. వారి ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఎదురుదాడికీ దిగుతోంది.

ఎదురుదాడికే..

ఎదురుదాడికే..

10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసానికి పాల్పడిన గౌతమ్ అదానితో ప్రధాని మోదీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలం నుంచే వారిద్దరూ మంచి స్నేహితులంటూ కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. పరోక్షంగా ఆయన ప్రసంగాన్ని తప్పుపట్టారు. కౌంటర్ అటాక్ చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాం మొత్తం కుంభకోణాలమయం అంటూ మండిపడ్డారు.

యూపీఏ హయాంలో

యూపీఏ హయాంలో

యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను తాము సరిదిద్దుతున్నామని, ఇది ప్రతిపక్షాలకు ఆందోళన, బాధకు గురి చేస్తోందని ఎద్దేవా చేశారు. 2004-2014 కాలం మొత్తం కుంభకోణాలు, ఉగ్రదాడులు జరిగాయని అన్నారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వడం కూడా కొందరికి నచ్చట్లేదని, దీనిపైనా విమర్శలు చేస్తోన్నారని ధ్వజమెత్తారు. దీన్ని పక్కదారి పట్టించడానికే అదాని అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని ఆరోపించారు.

డిమాండ్ల ప్రస్తావన..

డిమాండ్ల ప్రస్తావన..

గౌతమ్ అదాని విషయంలో తాము చేసిన డిమాండ్లను ఏవీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం, వాటికి సమాధానాలను ఇవ్వకుండా దాటవేయడం- అటు ప్రతిపక్ష సభ్యులను ఆగ్రహానికి గురి చేసింది. మోదీ ప్రసంగాన్ని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోదీ మాట్లాడుతున్న సమయంలో అదాని అంశాన్ని పదేపదే గుర్తు చేశారు. వాటినేవీ ఆయన పట్టించుకోలేదు. కాంగ్రెస్ పై ఎదురుదాడిని కొనసాగించారు.

విపక్షాల వాకౌట్..

విపక్షాల వాకౌట్..

తమ డిమాండ్లపై మోదీ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ పలువురు ప్రతిపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. సభ నుంచి బయటికి వెళ్లిపోవడం కనిపించింది. రాహుల్ గాంధీ కూడా వాకౌట్ చేసి బయటికొచ్చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రసంగం ప్రతిపక్షాలకు ఏ మాత్రం సంతృప్తి కలిగించలేదని, అదాని అంశాన్ని కనీసం ప్రస్తావించలేదని అన్నారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశామని స్పష్టత ఇచ్చారు.

విచారణ ఊసే లేదు..

విచారణ ఊసే లేదు..

అదానిపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ తాము ముందు నుంచీ డిమాండ్ చేస్తోన్నామని, మోదీ తన ప్రసంగంలో దీన్ని ప్రస్తావించలేదని అన్నారు. దీన్ని బట్టి చూస్తోంటే- తన స్నేహితుడు గౌతమ్ అదానిని మోదీ కాపాడుకుంటోన్నారనేది స్పష్టమౌతోందని తేల్చి చెప్పారు. తనకు స్నేహితుడు కానప్పుడు- జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

రక్షణ రంగంలో షెల్ కంపెనీలు..

అదానికి రక్షణ రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రక్షణరంగంలో డొల్ల కంపెలు ప్రవేశించడం ఏ మాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో లక్షల రూపాయల మేర బినామీ డబ్బులు పోగు చేసుకున్నారని ధ్వజమెత్తారు. వాటి గురించి ప్రధాని కనీస ప్రస్తావన తీసుకుని రాలేదని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయమని, ఇందులో రాజీపడకూడదని హితవు పలికారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+