వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: మోదీకి జగన్ ఊపిరి -ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ -డియర్ హేమంత్..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా విలయం చుట్టూ నెలకొన్న రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తికి, భారీ సంఖ్యలో మరణాలకు ప్రధాని మోదీనే బాధ్యుడని విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా, ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, మందుల కొరతపై కోర్టులు గ్యాప్ లేకుండా కేంద్రానికి మొట్టికాయలు వేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్, ఆక్సిజన్ కోసం అన్ని రాష్ట్రాల సీఎంలూ ప్రధానికి వరుస వినతులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు సీఎంలు నేరుగా పీఎంపై బహిరంగ విమర్శలకు దిగారు. సోషల్ మీడియాలో జనం తిట్లు సరేసరి. బీజేపీ యేతర సీఎంలు అందరూ కేంద్రం తీరును గర్హిస్తోన్నవేళ.. అన్ని వైపుల నుంచి ప్రధాని మోదీపై ఒత్తిళ్లు పెరగ్గా, ఆయనకు బిగ్ రిలీఫ్ ఇచ్చే బాధ్యతను వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ భుజానికెత్తుకున్న సందర్భం శుక్రవారం చోటుచేసుకుంది...

Recommended Video

PM Modi కి Ys Jagan బాసట, Jarkhand Cm కి క్లాస్ పీకిన AP CM || Oneindia Telugu

జగన్ బెయిల్ రద్దు: 10రోజులే గడువు -ఏపీ సీఎం, సీబీఐకి కోర్టు టైమ్ -ఏపీలో వ్యాక్సిన్లపై ఎంపీ రఘురామ బాంబు జగన్ బెయిల్ రద్దు: 10రోజులే గడువు -ఏపీ సీఎం, సీబీఐకి కోర్టు టైమ్ -ఏపీలో వ్యాక్సిన్లపై ఎంపీ రఘురామ బాంబు

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..


దేశంలో కరోనా విలయ పరిస్థితులపై వరుస సమీక్షలు నిర్వహిస్తోన్న ప్రధాని మోదీ శుక్రవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గ్రూపుల వారీగా ఫోన్లలో సంభాషణలు జరిపారు. తొలుత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ సీఎంలతో పాటు పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో, మధ్యాహ్నం తర్వాత మణిపూర్, త్రిపుర, సిక్కిం సీఎంలకు ప్రధాని ఫోన్ చేశారు. కాగా, పీఎంతో ఫోన్ సంభాషణలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన విమర్శలు చేశారు. సీఎంలకు ఫోన్లు చేస్తోన్న ప్రధాని మోదీ కేవలం తన మన్ కీ బాత్ (మనసులోని మాట) చెబుతున్నారేగానీ, ఇవతలివాళ్లు చెప్పేది వినిపించుకోవడం లేదంటూ సోరెన్ ఫైరయ్యారు. జార్ఖండ్ సీఎం చేసిన ఈ కామెంట్లపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఉదంతంలో మోదీకి మద్దతుగా ఏపీ సీఎం జగన్ రంగంలోకి దిగారు. హితవు పలుకుతున్నట్లుగా జార్ఖండ్ సీఎం సోరెన్ కు జగన్ చురకలు వేశారు..

డియర్ హేమంత్.. ఇలాగేనా?

డియర్ హేమంత్.. ఇలాగేనా?


కరోనా విపత్తు నిర్వహణలో ప్రధాని మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, కనీసం సీఎంల మాటను కూడా వినిపించుకోవడంలేదంటూ జార్ఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. ప్రధాని ఇప్పటిదాకా నిపుణులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని తీసుకోలేదని, ఆ విషయాన్ని ఎత్తి చూపిన హేమంత్ సోరెన్ ను బీజేపీ శ్రేణులు విమర్శించడం తగదని సోషల్ మీడియా హోరెత్తింది. అయితే, విషయం ఎలాంటిదైనాసరే, ప్రధాని, ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే వ్యవహారాలు ఇలా బహిరంగ రచ్చకు దారి తీయడం సరికాదనే భావనా వ్యక్తమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా జార్ఖండ్ సీఎంను సున్నితంగా మందలిస్తూ 'డియర్ హేమంత్ సోరెన్..' అని సంబోధనతో ఇలా రాసుకొచ్చారు..

oxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్‌ సర్వే షురూoxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్‌ సర్వే షురూ

మోదీకి మద్దతు ఇద్దామన్న జగన్..

మోదీకి మద్దతు ఇద్దామన్న జగన్..


''డియర్ హేమంత్ సొరేన్... మీరంటే నాకు చాలా గౌరవం. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరేదేమిటంటే... మనమధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి (కరోనా) విపత్కర పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న యుద్ధంలో మనం ఒకరినొకరు వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు'' అని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దీనిపై..

కొవిడ్ విలయం.. అల్లకల్లోలం..

కొవిడ్ విలయం.. అల్లకల్లోలం..

కరోనా విలయానికితోడు ఆక్సిజన్ విపత్తు తలెత్తి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఢిల్లీ సహా పలు నగరాల్లో ప్రాణవాయువు దొరక్క కొవిడ్ రోగులు చనిపోతున్న ఘటనలు, విదేశాల నుంచి దిగుమతైన యంత్రాలను కేంద్రం తన వద్దే పెట్టుకుని, రాష్ట్రాలకు తరలించని వైనం, టీకాల లభ్యత లేకున్నా మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తుండగా, సరిపడా టీకాలు పంపకుండా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను ఆపొద్దని ప్రధాని మోదీ పిలుపునివ్వడం లాంటి పరిణామాలు కేంద్రం బాధ్యతారాహిత్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయని, అడుగడుగునా జనం ఈ అంశాలను దుగ్ధస్వరాలతో ప్రశ్నిస్తున్నా సర్కారు వినిపించుకోవడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ ముంచెత్తబోతోందని మార్చిలోనే హెచ్చరించినా మోదీ సర్కార్ పట్టించుకోలేదని ప్రఖ్యాత సైంటిస్టులు బాహాటంగా చెబుతున్నారు. కొవిడ్ విలయంలో దేశం అల్లకల్లోలంగా మారిపోగా, మిమ్మల్ని మరే కాపాడుకోండి, ప్రభుత్వం ఏమీ చేయబోదన్న రీతిలో మోదీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సహా బీజేపీ యేతర పార్టీలన్నీ మండిపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వైసీపీ అధనేత వైఎస్ జగన్ ఒక్కరే మోదీకి బాసటగా నిలవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే..

మోదీతోకాదు కరోనాతో పోరాడండి..

మోదీతోకాదు కరోనాతో పోరాడండి..


మ‌న్ కీ బాత్ ప్ర‌సంగం మాదిరిగా ఏకపక్షంగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప‌్ర‌ధాని మోదీని విమ‌ర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై కేంద్ర మంత్రులు, బీజేపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వివాదంపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్‌ హ‌ర్ష వ‌ర్ధ‌న్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రులు కరోనాపై పోరాడాలేగానీ ప్రధాని మోదీపై కాదని హితవు పలికారు. దేశ ప్రధానిని ఒక మాట అనేటప్పుడు ముందు వెనుకా చూసుకోవాలని, కరోనాపై పోరు కేంద్ర, రాష్ట్రాలు కలిసి చేయాలని, సీఎంల వైఫల్యాన్ని దాచుకోడానికి పీఎంపై నిందలు తగవని, రాష్ట్ర ప్రభుత్వం తన ఖ‌జానాను మూసివేసి, నిధులు ఖ‌ర్చు చేయ‌కుండా కేంద్ర‌మే అంతా చేయాల‌న్నట్లుగా హేమంత్ సోరెన్ కోరుతున్నారని హ‌ర్ష వ‌ర్థ‌న్ ఆరోపించారు. "కరోనా వైరస్ తో పోరాడండి, ప్రధానితో కాదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు.

English summary
Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy on Friday joined union ministers and BJP leaders in defending Prime Minister Narendra Modi, after Jharkhand Chief Minister Hemant Soren aimed a dig at the Prime Minister over a phone conversation on the Covid pandemic in his state. However, while the BJP's responses were predictably furious, Mr Reddy's was measured; the YSR Congress chief urged his Jharkhand counterpart to not "indulge in politics that would only weaken our nation" and asked him to "come together and strengthen" the centre's pandemic response.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X