వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం.. మోడీ వల్లే సాధ్యమైంది: జేపీ నడ్డా

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఎవరికీ వారే తమ క్యాంపెయిన్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బాలచౌర్ ర్యాలీలో పాల్గొన్నారు. సిక్కుల కోసం తమ ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. కర్తార్ పూర్ కారిడార్ తెరిచామని చెప్పారు. అదీ 74 ఏళ్ల కల అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మీ కోసమే నిర్ణయం తీసుకొని.. ఓపెన్ చేశారని తెలిపారు.కారిడార్ కోసం రూ.120 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. సిక్కులు, రైతుల కోసం ఎవరూ పనిచేయడం లేదని చెప్పారు.

 PM Modi made Kartarpur corridor possible: JP Nadda

సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో 18 ఏళ్లు గడిపారు. రావి నదీ తీరాన గురద్వార కర్తార్‌పూర్ ఉంది. విదేశాల్లో ఉండే ఎన్నారైలు కూడా గురుద్వార దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చని హోంశాఖ తెలిపింది. రోజుకు 5 వేల మంది భక్తులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శిస్తారని అంచనా. ఏడాది మొత్తం యాత్ర కొనసాగించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. వారం మొత్తం యాత్రకు అనుమతి ఉంది. సెలవు దినాలేవీ లేవు. అయితే దేశ విభజన తర్వాత రాకపోకలు లేవు. ఇటీవల కారిడార్ నిర్మించడంతో సిక్కులు వెళ్లి ప్రార్థనలు చేసేందుకు వీలు కలిగింది

ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది.

English summary
BJP President JP Nadda on February 12 lauded the work of his party done in favour of the Sikh community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X