యానిమేషన్, గేమింగ్ రంగంలో భారత్ విజయాలు.. మోదీ మన్ కీ బాత్ హైలైట్స్ ఇవే!!
భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో 115వ ఎపిసోడ్ లో మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో అనేక కీలక విషయాల గురించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరుగుతుందని అలాగే లార్డ్ బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15వ తేదీన జరుగుతుందని పేర్కొన్న మోదీ వారి గొప్పతనాన్ని గుర్తు చేశారు.
అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు
గత ఏడాది నవంబర్ 15వ తేదీన లార్డ్ బిర్సా ముండా జన్మదినం సందర్భంగా తాను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామానికి వెళ్లానని తెలిపారు. ఇక ఆ ప్రయాణం తనపైన చాలా ప్రభావం చూపించిందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ప్రతి యుగంలోనూ భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పిన ప్రధాని మోదీ అభివృద్ధిలో భారతదేశం అన్ని ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ స్థానానికి చేర్చడమే తన లక్ష్యమని తెలిపారు.

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు
ఈ సందర్భంగా మోదీ ఆయన మనసులోని భావాలను పంచుకుంటూ దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని మోదీ పేర్కొన్నారు. ఇక యానిమేషన్ రంగంలో విప్లవం తీసుకురావడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
యానిమేషన్ ప్రపంచంలో విప్లవం
చోట భీమ్ లాగా ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, బాల హనుమాన్, మోటు పట్లు వంటి వాటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, భారతదేశంలోని యానిమేటెడ్ పాత్రలు సినిమాలు, వాటి కంటెంట్ లో ప్రత్యేకమైనవని మోదీ అన్నారు. యానిమేషన్ రంగంలో భారతదేశం ఒక విప్లవాన్ని తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యానిమేషన్ ప్రపంచంలో మేడిన్ ఇండియా, మేడ్ బై ఇండియా మెరుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
గేమింగ్ రంగంలోనూ భారత్ ప్రగతి
ఇక భారత్లో గేమింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు . ఇక భారతదేశం టెక్నాలజీ అభివృద్ధిలో కూడా గణనీయంగా ప్రగతి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా భారత్
భారతదేశం ఇప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించిందని, వాటిని 85 దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని మోదీ పేర్కొన్నారు. ఇవి మాత్రమే కాదు పిల్లల ఫిట్నెస్ పైన అధిక శ్రద్ధ చూపించడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications