తల్లికి మోదీ పరామర్శ: ప్రధానికి అండగా ఉంటా- రాహుల్ గాంధీ ప్రకటన..!!

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరా బెన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. హీరా బెన్ వయస్సు 100 సంవత్సరాలు. రాత్రి నుంచి ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తాయి. రోజువారీ టాబ్లెట్లను తీసుకోవడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ- మళ్లీ ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీనితో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు హీరాబెన్. భారతీయ జనత పార్టీకి చెందిన శాసన సభ్యులు దర్శనబెన్ వాఘేలా, కౌశిక్ జైన్.. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. హీరాబెన్‌ ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నారు. ఆమెకు అందుతోన్న వైద్యాన్ని పర్యవేక్షిస్తోన్నారు.

PM Modi meets his mother Heeraben in a hospital, Rahul Gandhi prayers for speedy recovery

హీరాబెన్ ఆరోగ్యంపై యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. అంతకుమించిన సమాచారాన్ని మరేదీ తన హెల్త్ బులెటిన్‌లో పేర్కొనలేదు. కాగా- తల్లి ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయలుదేరారు. కొద్దిసేపటి కిందటే ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లిని పరామర్శించారు. ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌తో మాట్లాడారు. తల్లికి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.


హీరాబెన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. తల్లి కొడుకు మధ్య ప్రేమ అనంతం, అమూల్యమని పేర్కొన్నారు. ఈ కఠిన సమయంలో తాను మోదీకి అండగా ఉంటున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+