ఎల్లుండి పంజాబ్ పోలింగ్: సిక్కు ప్రముఖులతో ప్రధాని మోడీ కీలక భేటీ

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి ఇవ్వాళే చివరిరోజు. ఈ సాయంత్రానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఆదివారం పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పంజాబ్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌లో మూడో దశలో 59 నియోజకవర్గాల్లో ప్రచారం పరిసమాప్తమౌతుంది. ఎల్లుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Recommended Video

    Punjab Elections 2022: పైకి ధీమా..లోపల అంతర్గత సమస్యలు | Election Commission | Oneindia Telugu

    పంజాబ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 117 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం, 2,13,88,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 24,689 పోలింగ్ బూత్‌లను నెలకొల్పింది. కాంగ్రెస్ జెయింట్స్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సహా శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

    PM Modi met a delegation of Sikh leaders at his residence led by BJP leader Manjinder Singh Sirsa

    ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- సిక్కు సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రముఖులతో సమావేశం అయ్యారు. మరో రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వారితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మన్‌జీందర్ సింగ్ సిర్సా సారథ్యంలో వారంతా ప్రధానిని కలిశారు.

    దేశ రాజధానిలోని నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల మోడీ అధికారిక నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. నివాసం ఆవరణలో వారంతా మోడీని కలిశారు. తమ సిక్కు సంప్రదాయబద్ధమైన స్కార్ఫ్‌ను ఆయన తలకు చుట్టారు. కాషాయరంగులో ఉన్న స్కార్ఫ్ అది. దానిపై సిక్కుల చిహ్నాన్ని ముద్రించారు. మోడీని వారంతా ఎందుకు కలిశారనడానికి సరైన కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉన్నందునే బీజేపీ నేత సిర్సా- వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

    ప్రధానిని కలిసిన వారిలో- ఢిల్లీ గురుద్వార కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచెవాల్, సేవాపంథీ అధ్యక్షుడు మహంత్ కరమ్‌జీత్ సింగ్, డేరాబాబా జంగ్ సింగ్, బాబా జోగా సింగ్, సంత్ బాబా మేజర్ సింగ్ వా, ముఖి డేరాబాబా తారా సింగ్ వా, జథేందర్ బాబా సాహిబ్ సింగ్‌జీ, సురీందర్ సింగ్, బాబా జస్సా సింగ్, శిరోమణి అకాలీ బుధ దాల్, డాక్టర్ హర్భజన్ సింగ్, సింగ్ సాహిబ్ జ్ఞాని రంజీత్ సింగ్, జథేందర్ తఖ్త్ ఉన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+