ట్రంప్ పై మోడీ అలక ! 4 పోన్ కాల్స్ కట్ ? జర్మన్ పత్రిక షాకింగ్..!
భారత్-అమెరికా మధ్య సుంకాల వివాదం నానాటికీ తీవ్రమమవుతోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలతో అమెరికా భారత్ పై ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. ఇందులో 25 శాతం సుంకాలు అయితే మరో 25 శాతం జరిమానాగా వసూలు చేస్తోంది. ఇప్పటికే 25 శాతం సుంకాల పెంపు అమల్లోకి రాగా, రేపటి నుంచి మరో 25 శాతం మోత మోగబోతోంది. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఓ వార్తా పత్రిక బాంబుపేల్చింది.
సుంకాల పెంపు నేపథ్యంలో ట్రంప్.. భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడేందుకు విఫలయత్నాలు చేస్తున్నట్లు జర్మనీలోని మింజ్ నగరం నుంచి వెలువడే ఫ్రాంక్ ఫర్టర్ అలీజ్ మైన్ అనే పత్రిక కథనం ప్రచురించింది. ఈ మధ్య కాలంలోనే నాలుగు సార్లు ఇలా ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నించారని, అయితే ఆయనకు నిరాశ తప్పలేదని తెలిపింది. దీంతో భారత్-అమెరికా మధ్య బంధం ఏ స్ధాయిలో పతనమైందో అర్దమవుతోంది.

ప్రస్తుతం ప్రపంచంలో బ్రెజిల్ కాకుండా భారత్ పై మాత్రమే అమెరికా 50 శాతం సుంకాలు విధిస్తోంది. మిగతా దేశాలకు మాత్రం ఊరటనిస్తోంది. అంటే రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ పై అమెరికా ఆగ్రహం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. అయితే ఇదే విషయం ఫోన్ చేసి చర్చించేందుకు ట్రంప్ .. ప్రధాని మోడీకి ఫోన్ చేస్తున్నా ఆయన స్పందించడం లేదని ఈ పత్రిక వెల్లడించింది.

ట్రంప్ విషయంలో మోడీ మనస్తాపం చెందారని ఈ పత్రిక కథనంలో పేర్కొంది. అందుకే ఇలా ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని తెలిపింది. ట్రంప్ విధానం సాధారణంగా అమెరికా మార్కెట్‌పై ఇతర దేశాలు ఆధారపడటాన్ని ఉపయోగించుకోవడానికి ఆయనకు వీలు కల్పించిందని కూడా అది పేర్కొంది. కానీ మోడీ దీనిని ప్రతిఘటించారని తెలిపింది. మోడీ తన మొదటి పదవీకాలంలో భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు రాజీ పడకుండా ట్రంప్‌తో సహకార సంబంధాన్ని కొనసాగించారని తెలిపింది. ఈ పరిస్థితిలో ఆశ్చర్యకరమైన అంశం ట్రంప్ మోడీని ఒప్పించడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు అని పేర్కొంది.












Click it and Unblock the Notifications