వైరల్ అవుతున్న మోడీ ట్వీట్, ఫ్రాన్స్ అధ్యక్షుడి అభినందన

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఓ రీ ట్వీట్ వైరల్ అయింది. తనను ఫాలో అయ్యే ఓ వ్యక్తికి మోడీ సమాధానం ఇచ్చారు. ఇది ఇప్పటికే ఆరువేల షేర్లు అయింది.

అజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్రధాని మోడీని ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. 'నువ్వు నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నావా..? అని ఓ వ్యక్తి నన్ను అడిగాడు. అందుకు నేను చిరునవ్వి నవ్వి.. కాదు డియర్‌, ప్రధాని మోడీనే నా కోసం పని చేస్తున్నారు అని చెప్పాను' అని ట్వీట్‌ చేశారు.

అజిత్‌ సింగ్‌ ట్వీట్‌కు ప్రధాని స్పందించారు. 'నిజమే.. నేను ప్రధాన సేవకుడిని కదా. ప్రతి భారతీయుడికి సేవకుడిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది' అని మోదీ రీట్వీట్‌ చేశారు. దీంతో మోడీపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు.

మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడి శుభాకాంక్షలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకుగాను ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఫ్రాంకోయిస్‌ హోలన్‌ మోడీకి అభినందనలు తెలిపారు. ఆయన ప్రత్యేకంగా మోడీకి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి గోపాల్‌ బగ్లే బుధవారం ట్వీట్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Narendra Modi has been quite active on social media these days, replying to congratulatory messages, Holi wishes and even giving witty replies to Twitter users.
Please Wait while comments are loading...