ప్రధాని తల్లి హీరాబెన్‌కు కరోనా వ్యాక్సిన్: మోడీ స్వయంగా..సంతోషంగా: వందేళ్ల వయస్సులో

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మలి విడతలో 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వయోధిక వృద్ధులు, 45 సంవత్సరాలకు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని.. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ క్రికెటర్లు, సినీ నటులు వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

PM Narendra Modi says his mother has taken the first dose of the COVID-19 vaccine today. I urge everyone to help and motivate people around you who are eligible to take the vaccine, he says.

తాజాగా- నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆమెకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమెకు నూరేళ్లు. ఈ విషయాన్ని మోడీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తన తల్లికి కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చారని తెలిపారు. తన తల్లి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. తమ చుట్టుపక్కల వారిని కరోనా వ్యాక్సిన్ కోసం ప్రోత్సహించాలని కోరారు. అర్హులందరూ వ్యాక్సినేషన్ కోసం ముందుకు రావాలని అన్నారు.

PM Modi says his mother has taken the first dose of the COVID19 vaccine

ఇదిలావుండగా.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. కొద్దిసేపటి కిందటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ఢంకల్ తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇదివరకు ఒడిశా, బిహార్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం అనారోగ్యం బారిన పడుతున్నారని, కొందరు మరణించినట్లు వార్తలు రావడం వల్ల ప్రజల్లో అపోహలు నెలకొన్నాయి. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+