PM Modi: అమ్మ కడుపున పుట్టలేదు-దేవుడే పంపించాడు- మోడీ షాకింగ్ కామెంట్స్..!
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ ప్రధాని మోడీ విద్యాభ్యాసం, డిగ్రీలపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు వారికి మరో అస్త్రం అందించేలా వ్యాఖ్యలు చేశారు. తన పుట్టుక విషయంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు మోడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జాతీయ మీడియా ఛానల్ న్యూస్ 18తో మాట్లాడుతూ ప్రధాని మోడీ.. తాను తల్లి కడుపున పుట్టినట్లు భావించనని, దేవుడు నేరుగా పంపినట్లే భావిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తనకు తాను సమాధానపర్చుకుంటున్ననని వ్యాఖ్యానించారు. తద్వారా తాను దేవుడి అవతారం లేదా దేవదూత అనే అర్ధం వచ్చేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యక్తిగత జీవితం గురించి అడిగిన ప్రశ్నకు మోడీ ఈ సమాధానం ఇచ్చారు.

మరోవైపు ఇప్పటికే మూడోసారి గెలిస్తే మోడీ దేవుడి అవతారంగా, నియంతగా మారతారనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో తనకు తానే ఆ విధంగా చెప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. మోడీ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు ట్రోలింగ్ మొదలుపెట్టేశాయి. ఈ విషయాన్ని తాము ముందే చెప్పామని గుర్తుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ మోడీ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications