పంజాబ్ సీఎం చన్నీపై ప్రధాని మోడీ విసుర్లు- ఆ కామెంట్లతో సంత్ రవిదాస్ కు అవమానం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న రాజకీయ పార్టీల మధ్య కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలను ఉద్దేశించి పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ యూపీ-బీహార్ భాయా అంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు మంటపుట్టి్ంచాయి. దీనిపై బీజేపీ నేతలు ఒకరిని మించి మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే కోవలో ప్రధాని మోడీ కూడా స్పందించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ 'యుపి, బీహార్ కే భయ్యా' వ్యాఖ్యను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా సంత్ రవిదాస్ వారసత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని తెలిపారు. పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, చన్నీ వ్యాఖ్యల్ని ఖండించారు. "సంత్ రవిదాస్జీ పంజాబ్‌లో పుట్టారా? ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారు, మీరు యూపీ ప్రజలను పంజాబ్‌లోకి ప్రవేశించనివ్వరని చెప్పారు. సంత్ రవిదాస్‌ను కూడా తరిమికొడతారా? అతని పేరు చెరిపేస్తారా ? అంటూ మోడీ పంజాబ్ సీఎం చన్నీని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ తన వ్యాఖ్యల్లోకి గురుగోవింద్ సింగ్‌ను కూడా లాగారు. గురుగోవింద్ సింగ్ జీ బీహార్‌లోని పాట్నాలో జన్మించారని, చన్నీ బీహార్ ప్రజలను తరిమికొడతామంటున్నారు గురుగోవింద్ సింగ్‌కి జరిగిన ఈ అవమానాన్ని మీరు సహిస్తారా? అంటూ ఓటర్లను ప్రశ్నించారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చన్నీ ఇరుకునపడుతున్నారు. తాజాగా బీజేపీ నేతల్ని ఉద్దేశించి బీహార్,యూపీ భాయా అంటూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ఎవరికి వారు తమదైన శైలిలో అన్వయించుకుంటున్నారు. దీంతో ఈ వివాదం ఎన్నికలు ముగిసే వరకూ ఇలాగే సాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications