నెహ్రూ, ఇందిర రికార్డు సమం చేయబోతున్న ప్రధాని మోడీ..!
తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రధానిగా పనిచేస్తూ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డు సమం చేసిన నరేంద్రమోడీ.. ఇప్పుడు మరో రికార్డుకు అడుగు దూరంలో నిలిచారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తే ప్రధాని మోడీ ఈ ఆరుదైన రికార్డును సమం చేస్తారు. దీంతో ఇప్పుడు పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోడీ చేసే ప్రసంగంపై అందరి దృష్టీ నెలకొంది.
ఇప్పటివరకూ భారత ప్రధానులుగా పనిచేసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ మాత్రమే వరుసగా 11 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆగస్టు 15న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తే ఆ రికార్డు సమం అవుతుంది. ఇప్పటివరకూ 11 సార్లు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేసిన మూడో ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డులకు ఎక్కబోతున్నారు. వరుసగా రెండుసార్లు యూపీఏ ప్రభుత్వాలు నడిపిన మన్మోహన్ సింగ్ 10 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలలో రెండో స్ధానంలో నిలుస్తారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జనవరి 1966 నుండి మార్చి 1977 వరకు, మళ్లీ జనవరి 1980 నుండి అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా పనిచేసిన ఇందిరా గాంధీ దేశాన్ని ఉద్దేశించి 16 సార్లు ప్రసంగించారు.ఈ ఏడాది ప్రసంగంతో, తన పదవీకాలంలో పది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా మోడీ అధిగమించనున్నారు.
అలాగే దేశ చరిత్రలో మరే ఇతర ప్రధానమంత్రికీ సాధ్యం కాని విధంగా సగటున 82 నిమిషాలతో అత్యధిక స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేసిన రికార్డు కూడా మోడీ సొంతం కానుంది. 2017లో అతి తక్కువగా 55 నిమిషాల నుంచి మొదలైన మోడీ ప్రసంగాలు 2016లో అత్యధికంగా 94 నిమిషాలకు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications