PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..!
ఇరాన్ వార్ ప్రభావం భారత్ పై ఊహించిన దాని కంటే ఎక్కువగానే పడుతోంది. దీంతో అన్నింటికీ సిద్ధమైపోవాలని ప్రధాని మోడీ తాజాగా పార్లమెంట్ వేదికగానే ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రులతో వర్చువల్ గా భేటీకి మోడీ (pm modi) సిద్దమయ్యారు. ఇవాళ సాయంత్రం జరిగే ఈ భేటీలో ప్రధాని మోడీ ఇరాన్ వార్ నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్ధితుల్ని వారికి వివరించడంతో పాటు వారి సహకారం కోరబోతున్నారు.
ఇరాన్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని భారతీయ నౌకల కోసం తెరుస్తున్నప్పటికీ ఇంధన సరఫరాలో లోటుపాట్లు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా ఇరాన్ వార్ ముదిరితే మరోసారి ఈ జలసంధి మూసేసే అవకాశం ఉండటం, అమెరికా పంతానికి పోయి ఇరాన్ పై దాడుల్ని మరింత ముమ్మరం చేస్తే సమస్య తీవ్రత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భయాలే ఇప్పుడు భారత్ లోనూ సగటు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. అందుకే ముందుగానే గ్యాస్, చమురును స్టాక్ పెట్టుకోవడం మొదలుపెట్టేశారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోడీ.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ చర్యలు అమలు జరిగేలా చూడటంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని కోరబోతున్నారు. అలాగే ఇంధన, నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులకు వివరించబోతున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారతదేశంపై దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉండవచ్చని ప్రధాని మోదీ హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ భేటీ జరగనుంది. అలాగే కోవిడ్ సమయంలో అనుసరించిన టీమ్ ఇండియా మోడల్ ను ప్రధాని మోడీ మరోసారి తెరపైకి తీసుకురానున్నారు. అంటే సమస్యను అందరూ కలిసి ఏకకాలంలో ఎదుర్కోవడం.












Click it and Unblock the Notifications