ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారతదేశంలో ఏవియేషన్ రంగం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఆసియాలోనే అతిపెద్ద ప్రపంచంలో నాలుగో అతి పెద్ద విమానాశ్రయంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 28వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని జేవార్ లో నిర్మాణంలో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు.

అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్

భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ విమానాశ్రయం నిలువనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 28వ తేదీ ఉదయం 11గంటల 30నిమిషాలకు జరగనుంది. ప్రధాని మోడీ 11:30 గంటలకు టెర్మినల్ భవనాన్ని సందర్శిస్తారు. ఆపై మధ్యాహ్నం 12గంటలకు విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.

PM Modi To Open Noida International Airport the largest in Asia and the fourth-largest in the world

11200 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్

భారతదేశానికి గర్వకారణంగా నిలిచే ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి రెండవ అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయబడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పైన భారాన్ని తగ్గించే ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచడంలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. సుమారు 11200 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పి పి పీ మోడల్ లో దీని నిర్మాణం జరిగింది.

ఆసియాలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దదిగా రికార్డ్

పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా రికార్డు సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని నాలుగు దశలలో రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు విస్తీర్ణం కూడా దశలవారీగా పెంచనున్నారు. మొదటి దశలో సుమారు 3296ఎకరాలలో విమానాశ్రయం విస్తరించి ఉంది. ఇందులో 3900మీటర్ల పొడవైన రన్ వే, ఒక ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్, టాక్సీవేస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

ప్రపంచ స్థాయి విమాన కేంద్రంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం

ఈ దశ పూర్తయితే సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణం చేసే అవకాశం ఉంది భారతీయ వారసత్వాన్ని, సంప్రదాయ ఘాట్ లను, హవేలీలో సౌందర్యాన్ని మేళవించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక మౌలిక సదుపాయాలను ఈ విమానాశ్రయాన్ని రూపొందించారు .ఈ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి విమాన కేంద్రంగా మార్చటంపై దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+