Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi Brunei Tour:బ్రూనైకు తొలి భారత ప్రధాని..ఆ రంగాలే టార్గెట్..!!

PM Modi Brunei Tour:మూడవసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ పలు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌తో పాటు పలు దేశాల్లో పర్యటించి ఆ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా ప్రధాని మోదీ సెప్టెంబర్ 3,4వ తేదీల్ల్లో బ్రూనై,సింగపూర్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ రెండు దేశాల పర్యటనల్లో మోదీ ఏ అంశాలపై చర్చిస్తారు..?

బ్రూనైకు తొలి ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బ్రూనైలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలుస్తారు. ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనుండటంతో ఇటు దేశీయ మీడియా అటు అంతర్జాతీయ మీడియా సైతం ఆసక్తి చూపుతున్నాయి. బ్రూనై సుల్తాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆదేశంలో పర్యటించనున్నారు. భారత్ బ్రూనై దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

PM Modi to visit Brunei and meet Sultan Hassanal Bolkiah to strength ties in Space and defence sector

మియన్మార్‌ వేదికగా 2014లో జరిగిన ఆసియన్ సదస్సులో బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక ఆ సమావేశం జరిగిన పదేళ్లకు మళ్లీ ప్రధాని మోదీ సుల్తాన్‌తో సమావేశం కానున్నారు. ఈ ఏఢాది జూలైలో విదేశాంగ మంత్రి జైశంకర్ బ్రూనై విదేశాంగ మంత్రితో లావోస్ వేదికగా జరిగిన ఆసియన్ సదస్సులో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇరువురు కలిసి ఒక లోగో కూడా ఆ సమయంలో ఆవిష్కరించారు.

స్పేస్ డిఫెన్స్ రంగాలపై ఫోకస్

ఇక ప్రధాని మోదీ బ్రూనై పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం, అంతరిక్షం మరియు రక్షణ రంగాల్లో సహాయసహకారాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ఇప్పటికే అంతరిక్షరంగంలో భారత్ బ్రూనై దేశాల మధ్య చాలా ఒప్పందాలు ఉన్నాయి.బ్రూనైలో భారత్‌కు చెందిన టెలిమెట్రీ సంస్థ కూడా ఉంది. ఎనర్జీ భద్రతపై అంటే ముడిచమురు, హైడ్రోకార్బన్స్ రంగంలో దృఢమైన బంధం కోసం భారత్ బ్రూనై దేశాలు ఒక్కటి కానున్నాయి.

బ్రూనైలో భారతీయులు సంఖ్య

ప్రస్తుతానికి బ్రూనై నుంచి భారత్ 270 మిలియన్ డాలర్లు విలువ చేసే ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇక "యాక్ట్ ఈస్ట్ పాలసీ"కి భారత్‌కు మద్దతుగా బ్రూనై నిలిచింది. ఇక రక్షణ రంగానికి వస్తే బ్రూనైతో కలిసి సంయుక్తంగా డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. భారత నావికా దళం కోస్ట్ గార్డ్‌ నౌకలు బ్రూనైకు తరచూ వెళుతుంటాయి.

జూన్ 2024 బ్రూనైలో ఆదేశ త్రివిధ దళాలు నిర్వహించిన డిఫెన్స్ ఇండస్ట్రీ ఎక్స్‌పొజియన్‌లో భారత్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎంకేయూ లిమిటెడ్‌లు పాల్గొన్నాయి.ఈ సందర్భంగా భారత్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సుల్తాన్ హజీ హస్సనల్ బోల్కియా, క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతదీ బిల్లాహ్ సందర్శించి భారత కంపెనీలపై ప్రశంసలు కురిపించారు. ఇక బ్రూనైలో 4,50,500 మందితో కూడిన జనాభా ఉండగా అందులో భారతీయుల సంఖ్య 14,500. వీరిలో చాలామంది ఆయిల్, గ్యాస్, కన్స్‌ట్రక్షన్, రీటెయిల్ బిజినెస్‌లో పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+