వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూతన పార్లమెంట్ వద్ద 6.5 మీటర్ల పొడవైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై వేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ అధికారుల ప్రకారం.. ఈ చిహ్నం మొత్తం 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తుతో కాంస్యంతో రూపొందించబడింది.

ఇది కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ ఫోయర్ పైభాగంలో వేయబడింది. చిహ్నానికి మద్దతుగా 6,500 కిలోల బరువున్న ఉక్కుతో కూడిన సహాయక నిర్మాణాన్ని నిర్మించినట్లు వారు తెలిపారు.

PM Modi Unveils 6.5-Metre Long National Emblem Cast On New Parliament Building Roof

ప్రారంభోత్సవం సందర్భంగా, కొత్త పార్లమెంటు నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.

కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెచ్, కాస్టింగ్ ప్రక్రియ క్లే మోడలింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ నుంచి కాంస్య కాస్టింగ్, పాలిషింగ్ వరకు ఎనిమిది వేర్వేరు దశల తయారీలో సాగిందని వారు తెలిపారు.

అంతకుముందు రోజు, రైతులు, ఇతర వ్యవసాయ సంఘాలు హాజరైన సహజ వ్యవసాయ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. అనంతరం జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించారు.

English summary
PM Modi Unveils 6.5-Metre Long National Emblem Cast On New Parliament Building Roof.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X