PM Modi: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ ఆరా
PM Modi: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(73) ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి, అసౌకర్యం కారణంగా ఎయిమ్స్‌లో చేరారు. ఉపరాష్ట్రపతిని తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఛాతీ నొప్పి, అసౌకర్యం కారణంగా ఎయిమ్స్ లో చేరినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. ఎయిమ్స్ కార్టియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ పర్యవేక్షణలో జగదీఫ్ ధన్‌ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీని గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ ఎయిమ్స్ కు వెళ్లి ఆరా తీశారు. ఉపరాష్ట్రపతి ఎయిమ్స్ కు చేరుకున్న వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Went to AIIMS and enquired about the health of Vice President Shri Jagdeep Dhankhar Ji. I pray for his good health and speedy recovery. @VPIndia
— Narendra Modi (@narendramodi) March 9, 2025












Click it and Unblock the Notifications