PM Modi Elephant Safari: ఏనుగుపై మోడీ సఫారీ-కజిరంగా జాతీయ పార్కులో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. అక్కడ ఏనుగులతో కలిసి కాసేపు గడిపారు. అనంతరం ఏనుగుపై సఫారీ కూడా చేశారు.
మావటి వాడు, పార్క్ డైరెక్టర్ తో కలిసి ఏనుగుపై ఎక్కి కాసేపు పార్కులో కలియ తిరిగారు. ఆ తర్వాత ఏనుగులకు చెరుకు గడలు తినిపించారు. అక్కడే ఉన్న వనదుర్గ గార్డులతో కాసేపు ముచ్చటించారు. పార్కులో పరిస్దితుల్ని అడిగి తెలుసుకున్నారు.

అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తొలిసారి సందర్శించారు. పార్క్ లో ఆయన ఏనుగు, జీప్ సఫారీలో ప్రయాణించారు. అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన వివరాల ప్రకారం 1957 తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ను సందర్శించిన మొదటి ప్రధాని ఆయనే. మోదీ మొదట ఏనుగు సఫారీ చేశారు. ఆ తర్వాత నేషనల్ పార్క్ సెంట్రల్ కోహోరా పరిధిలో ఉన్న మిహిముఖ్ ప్రాంతంలో జీప్ సఫారీ చేశారు.

"కాజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమానమైన అందాలను, అస్సాం ప్రజల వెచ్చదనాన్ని అనుభవించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను" అని ప్రధాన మంత్రి మోడీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. He also took an elephant safari here.
— ANI (@ANI) March 9, 2024
The PM also interacted with Van Durga, the team of women forest guards who are at the forefront of conservation efforts. During his visit, he also fed… pic.twitter.com/5sK46yQ6IS
"ఇది ప్రతి సందర్శన ఆత్మను సుసంపన్నం చేసే ప్రదేశం, అస్సాం హృదయంతో మిమ్మల్ని లోతుగా కలుపుతుంది," అని తెలిపారు. కజిరంగా జాతీయ పార్కులో లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్మాయి అనే మూడు ఏనుగులకు ప్రధాన మంత్రి చెరుకు తినిపించారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!











Click it and Unblock the Notifications