ఎట్టకేలకు ప్రధాని మోదీ బిగ్ స్టెప్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో పర్యటించనున్నారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోయిన చురాచాంద్‌పూర్ ను సందర్శించనున్నారు. శాంతిభద్రతలు పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతోండటం, మణిపూర్ పై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు నిలదీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఈ పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలను కలుసుకోనున్నారు.

తన పర్యటన సందర్భంగా రూ. 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిలో చురాచంద్‌పూర్‌- రూ. 7,300 కోట్లు, ఇంఫాల్‌- రూ. 1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా మరో రూ. 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ ఈ వివరాలను వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

PM Modi will visit Manipur on September 13 to inaugurates development works

ఢిల్లీ నుంచి ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో మోదీ మణిపూర్ కు బయలుదేరుతారు. 11:30 గంటలకు చురాచంద్‌పూర్‌కు చేరుకుంటారు. అల్లర్లు, దాడుల ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శిస్తారు. మృతుల కుటుంబీకులతో సమావేశమౌతారు. అనంతరం మౌలిక సదుపాయాల కల్పనక సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. కొన్నింటిని ప్రారంభిస్తారు. స్టేట్ పీస్ గ్రౌండ్‌లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్లాకు చేరుకుంటారు. అక్కడ కూడా బాధిత కుటుంబాలవారిని పరామర్శిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. 2023లో హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయిన తర్వాత ప్రధాని మోదీ మణిపూర్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. నాటి దాడుల్లో తీవ్రంగా నష్టపోయింది ఈ చురాచాంద్ పూర్ జిల్లానే. కుకీలు మెజారిటీగా ఉన్న నగరం అది. నేరుగా అక్కడికి వెళ్లనున్నారు మోదీ.

మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, దీనిపై మాట్లాడటానికి ఆయన ఎందుకు సంశియిస్తోన్నారంటూ గతంలో పలుమార్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మణిపూర్ ను ఎందుకు సందర్శించట్లేదనీ నిలదీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మోదీ ఆ రాష్ట్ర పర్యటన చేపట్టడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+