మరో కొత్త ఆపరేషన్ ప్రారంభిస్తున్న మోడీ..! పాక్ కు దిమ్మతిరిగేలా..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా ముగించిన భారత్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యూహాలపై ఫోకస్ పెంచుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్ని ఏకం చేసేందుకు అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ పై స్వల్పకాలిక యుద్ధం తాము చేయడం కంటే ప్రపంచ దేశాల నుంచి ఉగ్రవాదానికి మద్దతిస్తున్న ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ కొత్త ఆపరేషన్ ప్రారంభిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ కు కీలక మిత్రదేశాల్లో పర్యటించి ఉగ్రవాద వ్యతిరేక సందేశం వినిపించేందుకు వీలుగా ప్రధాని మోడీ ఇవాళ ఏడుగురు ఎంపీల నేతృత్వంలో వేర్వేరు అఖిలపక్ష బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తో పాటు బీజేపీ ఎంపీలు రవి శంకర్ ప్రసాద్, బైజయంత్ పాండ్యా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన షిండే వర్గం ఎంపీ శ్రీకాంత్ షిండే ఉన్నారు. ఈ ఏడుగురు ఎంపీల నేతృత్వంలోని అఖిలపక్ష బృందాలు త్వరలో ఐరాసతో పాటు భారత్ కు కీలక మిత్రదేశాల్లో పర్యటిస్తాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

శశిథరూర్ నేతృత్వంలో అఖిల పక్ష బృందం అమెరికాకు వెళ్లనుంది. తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం,
రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్లేలా కేంద్రం షెడ్యూల్ చేసింది. ఆయా దేశాల్లో వీరు రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది.
In moments that matter most, Bharat stands united.
— Kiren Rijiju (@KirenRijiju) May 17, 2025
Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism.
A powerful reflection of national unity above politics, beyond differences.@rsprasad @ShashiTharoor… pic.twitter.com/FerHHACaVK
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరును ఈ అఖిలపక్ష ఎంపీల బృందాలు మిత్రదేశాలకు వివరించబోతున్నాయి. వీరు ఐరాస భద్రతా మండలి సభ్యదేశాలతో పాటు భారత్ మిత్రదేశాల్లో పర్యటిస్తారని తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకమవుతున్న తీరు, ఏ విధమైన తీవ్రవాదానికి అయినా తాము వ్యతిరేకమన్న సందేశం వీరు మిత్రదేశాలకు వినిపిస్తారు. తీవ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని వీరు ఆయా దేశాలకు వివరిస్తారు. తద్వారా పాకిస్తాన్ పై దౌత్యపరంగా ఒత్తిడి పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications