LPG: మోడీ సర్కారు రాఖీ, ఓనం కానుక: ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 200 తగ్గింపు, వారికి రూ. 400
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు రాఖీ, ఓనం పండగల సందర్భంగా శుభవార్త అందించింది. గృహ వినియోగదారుల వంట గ్యాస్‌పై అదనంగా రూ. 200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇక ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 400 రాయితీ లభించనుంది.
రక్షా బంధన్, ఓనం సందర్భంగా మోడీ ప్రభుత్వం చౌకైన ఎల్పీజీ సిలిండర్లను బహుమతిగా ఇవ్వనుంది. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 400 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతోపాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని.. రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది.
కాగా, ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1103గా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మాత్రం స్థిరంగా ఉంచుతున్నారు.
ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ. 50 చొప్పున పెంచారు. 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద 5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ పథకం లక్ష్యానికి చేరువలో ఉంది.












Click it and Unblock the Notifications