బుల్లెట్ రైలు వద్దా, మీకు ఎద్దుల బండి కావాలి: సింగపూర్ కంటే గొప్పగా చేస్తా, మోడీ!

Posted By:
Subscribe to Oneindia Telugu
Gujarat Assembly Elections : Modi In Public Meeting

అహ్మదాబాద్: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును వ్యతిరేకించే వారందరూ ఎద్దుల బండిపై ప్రయాణం చేయాలని గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్‌- ముంబైల మధ్య జపాన్‌ సహకారంతో లక్షా పదివేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బావ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

కాంగ్రెస్ కు సాధ్యం కాలేదు

కాంగ్రెస్ కు సాధ్యం కాలేదు

కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినా అది సాధ్యం కాలేదని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రారంభించడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు.

ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగ అవకాశాలు

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అతి తక్కువ మొత్తానికి బుల్లెట్ రైలు ప్రాజెక్టును తీసుకురావడంతో కాంగ్రెస్‌ పార్టీ సహించలేకపోతున్నదని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వల్ల గుజరాత్‌లో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

కాంగ్రెస్ చేసింది శూన్యం

కాంగ్రెస్ చేసింది శూన్యం

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఉపయోగించే ముడి సరుకు మొత్తాన్ని జపాన్‌ భారత్‌ నుంచే కొనుగోలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలకు గుజరాత్‌తో సంబంధాలు ఉన్నా రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

 గుజరాత్ అభివృద్ధి!

గుజరాత్ అభివృద్ధి!

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుజరాత్‌లో అభివృద్ధి జరుగుతోందని నరేంద్ర మోడీ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.

 ప్రపంచంలోనే!

ప్రపంచంలోనే!

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించనుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు వల్ల గుజరాత్ రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

సింగపూర్ కంటే గొప్పగా గుజరాత్!

సింగపూర్ కంటే గొప్పగా గుజరాత్!

గుజరాత్ రాష్ట్రం తీర రేఖ పోడవునా 1, 300 దీవులు అభివృద్ది చేసి సింగపూర్ కంటే గొప్పగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక ప్రజలకు మనవి చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi addresses Public Meeting in Bhavnagar in Gujarat.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి